Begin typing your search above and press return to search.
మణి రత్నం గురించి శంకర్ ఏమన్నాడో విన్నారా ?
By: Tupaki Desk | 8 Sep 2022 2:30 AM GMTలెజెండరీ డైరెక్టర్ మణిరత్నం టేకింగ్, మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయన డైరెక్ట్ చేసిన 'పల్లవి అనుపల్లవి' నుంచి కమ్ బ్యాక్ మూవీ 'ఓ కాదల్ కన్మణి' వరకు మణిరత్నం చేసిన ప్రతి సినిమా ఓ ఆణిముత్యమే. సరికొత్త కథలు, నేపథ్యాల్లో సినిమాలని తెరకెక్కిస్తూ సమాజిక సమస్యలని తన సినిమాల్లో చూపిస్తూ దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు మణిరత్నం. గత కొన్నేళ్లుగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'పొన్నియిన్ సెల్వన్'ని తెరపైకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేశారు.
ఫైనాన్షియర్స్ వెనక్కి తగ్గడంతో విజయ్, మహేష్ బాబు తో చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తానికి పట్టాలెక్కింది. చియాన్ విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, జయం రవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఎపిక్ మూవీని రెండు భాగాలుగా ఐమాక్స్ ఫార్మాట్ లో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ పూర్తయింది. సెప్టెంబర్ 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు.
సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని ఫాస్టప్ చేసింది. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియో సాంగ్స్ , టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఎపిక్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం ప్రధాన హైలైట్ గా నిలిచింది.
ఈ సందర్భంగా చెన్నైలో ఆడియో, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని చిత్ర బృందం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ దర్శకుడు మణిరత్నంపై ప్రశంసలు కురిపించారు.
పాన్ ఇండియా సినిమాల ప్రస్తుతం జరుగుతున్న చర్చలని వివరిస్తూ ఈ తరహా సినిమాలను పరిచయం చేయడంలో మణిరత్నం ముందు వరుసలో వున్నారని, ఆయనే పాన్ ఇండియా మూవీస్ ని పరిచయం చేశారన్నారు.
అంతే కాకుండా 'గీతాంజలి' సినిమాలోని పాటలను చిత్రీకరించిన తీరు ఇప్పటికీ తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. గత కొంత కాలంగా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మణిరత్నం ఈ ఈ మూవీతో సంచలనం సృష్టించడం ఖాయం అని సర్వత్రా వినిపిస్తోంది. ఏం జరగనుందో తెలియాలంటే సెప్టెంబర్ 30 వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.