Begin typing your search above and press return to search.

శంక‌ర్ - కొర‌టాల సెంటిమెంటును తిర‌గ‌రాస్తారు!

By:  Tupaki Desk   |   10 July 2021 12:30 AM GMT
శంక‌ర్ - కొర‌టాల సెంటిమెంటును తిర‌గ‌రాస్తారు!
X
ఇండ‌స్ట్రీ సెంటిమెంట్ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఫ‌లానా ద‌ర్శ‌కుడితో హిట్ కొట్టాక వెంట‌నే ఆ హీరో ఫ్లాప్ బాట ప‌ట్టాడు! అనే టాక్ టాలీవుడ్ లో చాలా సార్లు వినిపించింది. ముఖ్యంగా ఎస్.ఎస్.రాజ‌మౌళితో ప‌ని చేశాక ఏ హీరో అయినా ఆ వెంట‌నే చేసే సినిమాతో ఫ్లాప్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హిస్ట‌రీ చెబుతోంది. అది సెంటిమెంటుగా మారిపోయింది. గ‌తంలో ఎన్టీఆర్ - ర‌వితేజ‌- ప్ర‌భాస్ - సునీల్ ఎవ‌రూ అతీతులు కాదు. రాజ‌మౌళితో సినిమాలు చేసిన వీరంతా ఆ వెంట‌నే ఫ్లాప్ ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అందుకే ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ చేస్తున్న‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల‌తో ప‌ని చేసే ద‌ర్శ‌కులు ఆ సెంటిమెంట్ రాంగ్ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. రాజ‌మౌళితో బంప‌ర్ హిట్లు కొట్టినా తాము అంత‌కుమించి పెద్ద హిట్టిస్తామ‌ని నిరూపించి స‌త్తా చాటాల్సి ఉంటుంది.

చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ ఆర్.సి 15 ... ఎన్టీఆర్ - కొర‌టాల కాంబినేష‌న్ మూవీ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ రెండు సినిమాలు క‌న్ఫామ్ గా విజ‌యాలు సాధించాల్సిందే. ఒక‌వేళ ఫ్లాపుల‌యితే శంక‌ర్ .. కొర‌టాల వంటి వారే ఆ సెంటిమెంటును మార్చ‌లేక‌పోయార‌న్న చ‌ర్చ టాలీవుడ్ లో మ‌రింత బ‌లోపేతం అవుతుంది. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్ ల‌తో త‌దుప‌రి సినిమాలు చేసే ద‌ర్శ‌కులు త‌ప్ప‌నిస‌రిగా వారికి హిట్టివ్వాల్సిందే.

ఇక ఇండ‌స్ట్రీలో రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా కొర‌టాల పేరు మార్మోగుతోంది. అత‌డు ఓ సినిమా చేస్తే క‌న్ఫామ్ గా బ్లాక్ బ‌స్ట‌రే. ఇప్పుడు తార‌క్ కి అత‌డు హిట్టిచ్చి సెంటిమెంటును మార్చాలి. అయితే శంక‌ర్ ఇటీవ‌ల తెర‌కెక్కించిన మూడు నాలుగు భారీ చిత్రాలు ఫ్లాపులుగా మిగిలాయి. అందుకే ఇప్పుడు శంక‌ర్ ముందు అతి పెద్ద స‌వాల్ ఉంది. చర‌ణ్ తో అత‌డు చేసే సినిమా బంప‌ర్ హిట్ కొట్టాలి. దాంతో ఇటు చ‌ర‌ణ్ కి అటు శంక‌ర్ కి కూడా జాతీయ అంత‌ర్జాతీయ స్థాయి ఖ్యాతి ద‌క్కాలని మెగాభిమానులు ఆశిస్తున్నారు. అయితే మునుముందు ఏం జ‌ర‌గ‌నుంది? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. రాజ‌మౌళితో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్ ల‌కు త‌దుప‌రి సినిమా చాలా చాలా కీల‌కం. క‌చ్ఛితంగా విజ‌యం సాధించి సెంటిమెంటును తిర‌గ‌రాయాల్సిందే.