Begin typing your search above and press return to search.
రాజీ కుదిరింది.. సూపర్ హిట్ సీక్వెల్ ఉంది
By: Tupaki Desk | 29 Oct 2021 6:04 AM GMTసౌత్ దిగ్గజ దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమాను చేస్తున్నవిషయం తెల్సిందే. వీరి కాంబోలో మూవీ ఇటీవలే పుణె లో చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. మరో వైపు ఈ సినిమా ను ఎట్టిపరిస్థితుల్లో ఆపేసేందుకు లైకా ప్రొడక్షన్స్ వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారంటూ తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇండియన్ 2 సినిమా పూర్తి చేయకుండా శంకర్ మరే సినిమాను మొదలు పెట్టకూడదు. కనీసం ఇండియన్ 2 విడుదల కాకుండా మరే సినిమాకు శంకర్ కమిట్ కాకూడదు అనే అగ్రిమెంట్ లైకా వారి వద్ద ఉంది. దాంతో లైకా వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది. శంకర్ కు అనుకూల తీర్పు వచ్చినా కూడా రామ్ చరణ్ తో శంకర్ చేస్తున్న సినిమా విడుదల సమయంలో అయినా లైకా వారు మళ్లీ కోర్టుకు వెళ్లి సినిమా విడుదల కాకుండా స్టే ఆర్డర్ తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే లైకా వారితో రాజీ కుదుర్చుకునేందుకు శంకర్ ఓకే చెప్పాడని తెలుస్తోంది.
కోర్టులో కాకుండా కోర్టు బయట ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని జడ్జీలు సలహా ఇచ్చారు. దాంతో రెండు వైపుల కూడా పెద్దలు కూర్చుని ఇద్దరికి నష్టం జరుగకుండా ఒక నిర్ణయానికి వచ్చారు. పెద్దల నిర్ణయం పట్ల లైకా వారు మరియు శంకర్ కూడా వినుకుంటామన్నారు. ఆ ప్రకారంగా పెద్దలు ఒక తీర్పును ఇవ్వడం జరిగిందట. దాని ప్రకారం రామ్ చరణ్ తో సినిమాను మొదలు పెట్టిన నేపథ్యంలో ఇండియన్ 2 ఇప్పుడు పూర్తి చేయడం సాధ్యం అయ్యే అవకాశం లేదు. కనుక లైకా వారు శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 ను పూర్తి చేసేందుకు చరణ్ మూవీ పూర్తి అయ్యే వరకు వెయిట్ చేయాలంటూ సూచించారు. చరణ్ మూవీ పూర్తి అయిన తర్వాత రెండు లేదా మూడు నెలల సమయంలో ఇండియన్ 2 ను ముగించేలా లైకా ప్రొడక్షన్స్ వారు శంకర్ తో ఒప్పందం ను మళ్లీ చేసుకున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
కమల్ హాసన్ అభిమానులు ఇండియన్ 2 మద్యలో నిలిచి పోవడంతో చాలా బాధ పడ్డారు. సూపర్ హిట్ ఇండియన్ సినిమా కు సీక్వెల్ అంటే భారీ రేంజ్ లో అంచనాలు ఉంటాయి. అలాంటి సినిమాను పూర్తి చేయక పోవడం శంకర్ తప్పు అంటూ కొందరు వాదిస్తే.. లైకా వారి తప్పును కొందరు ఎత్తి చూపిస్తున్నారు. మొత్తానికి ఇండియన్ 2 వివాదం సర్దుమనిగింది. లైకా మరియు శంకర్ ల మద్య రాజీ కుదిరింది. ఇండియన్ 2 సినిమా కాస్త ఆలస్యం అయినా రాబోతుంది. అదే సమయంలో రామ్ చరణ్.. శంకర్ ల కాంబోలో రాబోతున్న సినిమాకు ఎలాంటి కోర్టు పరమైన ఇబ్బందులు ఉండబోవడం లేదు. మొత్తానికి ఈ వ్యవహారం సినీ ప్రియులకు చాలా ఊరటను ఇస్తుంది. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడు ఇలాంటి కోర్టు సమస్యల్లో ఉండటం వల్ల వందల కోట్లు పెట్టి నిర్మాణం జరిగే ఆయన సినిమాలపై ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఆ వివాదం లేదు కనుక శంకర్ రాబోయే సినిమాలు ఖచ్చితంగా బాగుంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.