Begin typing your search above and press return to search.
చరణ్ కి కొత్త మీసకట్టును సెట్ చేసిన శంకర్!
By: Tupaki Desk | 4 Oct 2021 1:30 PM GMTశంకర్ .. చరణ్ కాంబినేషన్లోని సినిమాపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఎందుకంటే శంకర్ ఎక్కువగా తమిళ హీరోలతోనే సినిమాలు చేస్తాడు .. అవి మిగతా భాషల్లో మాదిరిగానే తెలుగులోకి అనువాదమవుతూ ఉంటాయి. అయితే ఆయన సినిమాలనెప్పుడూ తెలుగు ప్రేక్షకులు అనువాద చిత్రాలుగా భావించలేదు. కథాకథనాలను ఆయన ఎంచుకునే తీరును గురించి .. తెరపై వాటిని ఆవిష్కరించే విధానాన్ని గురించి గొప్పగా చెప్పుకున్నారు. పాన్ ఇండియా సినిమా అనే మాట ఇప్పుడు వినిపిస్తోందిగానీ, శంకర్ నుంచి వచ్చిన ప్రతి సినిమా ఆ కోవకి చెందినదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
సాధారణంగా శంకర్ సినిమా అంటే .. అప్పటివరకూ తెరపై కనిపిస్తూ వచ్చిన హీరో లుక్ ను ఆయన తన సినిమాతో మార్చేస్తాడు. ఆ పాత్రకి తగినట్టుగా కొత్త లుక్ ను డిజైన్ చేయిస్తాడు. తన సినిమాలో ఏ పాత్ర ఎలా ఉండాలనే విషయంలో శంకర్ కి పూర్తి క్లారిటీ ఉంటుంది. అందుకు తగినట్టుగానే ఆయన ఆయా ముఖ్యమైన పాత్రల డిజైన్స్ ను గీయిస్తాడు.డిఫరెంట్ గెటప్ ను సెట్ చేస్తాడు. అవసరమైతే మేకప్ మేన్స్ ను విదేశాల నుంచి రప్పిస్తాడు. అందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేయిస్తాడు. అయితే హీరోల లుక్ విషయంలో ఆయన ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.
'భారతీయుడు'లోని కమల్ లుక్ .. 'అపరిచితుడు' లోని విక్రమ్ లుక్ .. 'రోబో'లోని రజనీ లుక్ .. ఇలా ఆయన డిజైన్ చేసిన లుక్స్, ఆ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయని చెప్పొచ్చు. అలాంటి శంకర్ .. చరణ్ ను తెరపై ఎలా చూపించనున్నాడు? ఎలాంటి లుక్ తో చరణ్ కనిపించనున్నాడు? ఆ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి? ఇలా అనేక సందేహాలు అభిమానులలో ఆసక్తిని పెంచుతూ పోతున్నాయి. అయితే ఈ సినిమాలో చరణ్ ను శంకర్ చాలా సింపుల్ గానే చూపించనున్నాడని అంటున్నారు. పాత్ర పరంగా మీసకట్టు మాత్రం మార్చనున్నారని చెప్పుకుంటున్నారు. అంతకు మించి పెద్దగా ఎలాంటి మార్పులు చేయడం లేదని అంటున్నారు.
ఈ సినిమా కోసం హైదరాబద్ లో భారీ సెట్లు వేస్తున్నారు. ఆ సెట్లు పూర్తి కావొచ్చాయని తెలుస్తోంది. ఈ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా కియారా అద్వానిని తీసుకున్నారు. గతంలో ఆమె చరణ్ జోడీగా 'వినయ విధేయరామ' చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అంతగా ఆ ఆడలేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో ఆమెకున్న క్రేజ్ వేరు. తెలుగు .. తమిళ భాషల్లో కూడా ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందువలన ఆమెను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో చిరంజీవి కూడా కనిపించనున్నారనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. దాదాపు ఓ 30 నిమిషాల నిడివిగల పాత్రలో చిరంజీవి కనిపించేలా చేయాలనుకుంటున్నారని సమాచారం. అయితే ఒకసారి ఒక ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడుతూ, శంకర్ దర్శకత్వంలో తనకి నటించాలని ఉందనే అభిలషను వ్యక్తం చేశారు. శంకర్ మాత్రం తన కోసం ఎలాంటి కథలను రెడీ చేయడం లేదంటూ సరదాగా అన్నారు. ఆ ముచ్చట ఈ సినిమాతో తీరనుందని చెప్పుకుంటున్నారు. వరుసగా భారీ సినిమాలను పట్టాలెక్కిస్తున్న చిరంజీవికి, మళ్లీ శంకర్ సినిమా వైపుకు తొంగిచూసే సమయం ఉంటుందా అనేదే డౌటు.