Begin typing your search above and press return to search.
`2.0` సీన్స్ అంత నచ్చాయంట!
By: Tupaki Desk | 13 July 2018 10:58 AM GMTరజనీకాంత్ కథానాయకుడిగా నటించిన `2.0` గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయవంతమైన `రోబో`కి సీక్వెల్ కావడం... సుమారు రూ: 500 కోట్లతో రూపొందిన అత్యంత భారీ చిత్రం కావడంతో విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకి ఇటీవలే విడుదల తేదీని ఖరారు చేసుకుంది. నవంబరు 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు దర్శకుడు శంకర్ వెల్లడించారు. దాంతో అన్ని పరిశ్రమల్లోనూ ఈ సినిమా వేడి మొదలైంది.
అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పలుమార్లు సినిమా విడుదల వాయిదా పడటంతో - ఈ సినిమా హక్కులు కొనుక్కున్న పలు ప్రాంతాల ఇన్వెస్టర్లంతా తమ డబ్బుని తమకి వెనక్కిచ్చేయాలని నిర్మాతలపై ఒత్తిడి తీసుకొచ్చారట. విడుదల తేదీని ఖరారు చేశాక కూడా కొద్దిమంది ఇదే డిమాండ్ చేశారట. అందులో తెలుగు డిస్ట్రిబ్యూటర్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఆ విషయం దర్శకుడు శంకర్ దృష్టికి రావడంతో ఆయన... డబ్బు తిరిగిచ్చేయమని అడిగిన వాళ్లందరినీ చెన్నైకి పిలిపించి చిత్రంలోని 15 నిమిషాల ఫుటేజీని ప్రత్యేకంగా చూపించాడట. అది చూశాక మా డబ్బు మాకు వెనక్కివ్వాలని డిమాండ్ చేసినవాళ్లంతా మరోమాట మాట్లాడకుండా వెనక్కి వచ్చేశారట. ఆ సన్నివేశాలు అంత బాగా నచ్చాయట. ఆలస్యమైనా పర్లేదు... సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని ఇన్వెస్టర్లంతా ఆనందంగా ఇంటికొచ్చారట. ఆ 15 నిమిషాల సన్నివేశాలు అంత మేజిక్ చేశాయట. మరి సినిమాని మొత్తం ఏ రేంజిలో ఉంటుందో చూడాలి. `బాహుబలి` తర్వాత ఆ స్థాయిని మించిన బడ్జెట్ తో రూపొందిన భారీ చిత్రమిది. ఇది కూడా బాహుబలి స్థాయిలో విజయవంతమైందంటే ఇక ప్రపంచం మొత్తం దక్షిణాది చిత్ర పరిశ్రమవైపు చూడటం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.