Begin typing your search above and press return to search.

శంకర్ మొదటిసారి సంతకం పెట్టాడా?

By:  Tupaki Desk   |   29 May 2019 8:13 AM GMT
శంకర్ మొదటిసారి సంతకం పెట్టాడా?
X
సౌత్ సినిమాను ఎవరూ ఊహించని స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు శంకర్ కు గత కొన్నేళ్ళుగా టైం బాలేదు. విక్రం తో ఎన్నో ఆశలు అంచనాలతో తీసిన ఐ తీవ్రంగా నిరాశపరిచింది. సరే సూపర్ స్టార్ అండగా ఉన్నారు కదాని రజినీకాంత్ తో తీసిన రోబో సీక్వెల్ 2.0 వసూళ్లు ఘనంగా రాబట్టినా ఫైనల్ గా ఓవర్ కాస్ట్ వల్ల నష్టాలు తెచ్చి ఫెయిల్యూర్ గానే మిగిలింది. అందుకే కమల్ హాసన్ తో ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టిన ఇండియన్ 2 ఎంతకీ ముందుకుసాగడం లేదని చెన్నై మీడియా కోడై కూసింది.

దానికి తగ్గట్టు నిజంగానే షూటింగ్ అప్ డేట్స్ లేకపోవడం అనుమానాలను బలోపేతం చేసింది. అందుకు కారణం లైకా సంస్థ ఈసారి బడ్జెట్ కంట్రోల్ తప్పకుండా చెప్పిన మొత్తంలోనే సినిమా పూర్తి చేయాలని శంకర్ ని అగ్రిమెంట్ మీద సైన్ చేయమని అడగడమేనని కథనాలు వచ్చాయి. దీని కోసమే కొంత టైం తీసుకున్న శంకర్ ఈలోపు ఇండియన్ 2ని ఇంకెవరైనా టేకప్ చేస్తారేమో అని ప్రయత్నాలు చేశాడట. ఒకదశలో రిలయన్స్ ముందుకు వచ్చిందని బడ్జెట్ విషయంలో నో లిమిట్ చెప్పిందని ఇంకో న్యూస్ వచ్చింది. కాని అవన్నీ నిరాధారాలు అని తర్వాత తేలింది.

ఫ్రెష్ అప్ డేట్ మేరకు శంకర్ ఎట్టకేలకు ఒప్పందం మీద సంతకం పెట్టాడట. ఎంత బడ్జెట్ లైకా లాక్ చేసింది అనే వివరం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇది అధికారికంగా వచ్చిన ప్రకటన కాదు కాని కోలీవుడ్ సర్కిల్స్ లో దీని గురించి హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. శంకర్ ఇప్పటిదాకా ఎంత అడిగితే అంతా పెట్టిన నిర్మాతలు ఉన్నారు ఇలా లిమిట్ పెట్టడం మాత్రం లైకానే మొదలు అట. అవును మరి 2.0 ఇచ్చిన అనుభవం చిన్నదా. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్ సేనాపతి కొనసాగింపు పాత్రలోనే కనిపించనున్నాడు.