Begin typing your search above and press return to search.

శంకర్ సంతకం కొత్త దారి చూపుతుందా?

By:  Tupaki Desk   |   2 Jun 2019 5:13 AM GMT
శంకర్ సంతకం కొత్త దారి చూపుతుందా?
X
ఏడేళ్ల క్రితం లారెన్స్ దర్శకత్వంలో రెబెల్ అనే సినిమా రూపొందింది. భగవాన్ - పుల్లారావు నిర్మాతలు. ప్రభాస్ కున్న క్రేజ్ దృష్ట్యా కథ డిమాండ్ చేసిందన్న కారణంతో ముందుగానే దీనికి భారీ బడ్జెట్ కేటాయించారు. కానీ అనుకున్న దాని కన్నా చాలా ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టించాడు లారెన్స్. షూటింగ్ కూడా ప్లానింగ్ ప్రకారం జరగకపోవడంతో చాలా ఆలస్యంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది.

ఫలితంగా ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయి హీరో మార్కెట్ ని మించి వ్యయం చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే బొమ్మ డిజాస్టర్. సగం కూడా వెనక్కు రాలేదు. దీంతో నిర్మాతలు లారెన్స్ తమతో హద్దులు దాటి ఖర్చు పెట్టించాడని ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు. ఈ వివాదం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. తర్వాత ఏదో రాజీ కుదిర్చారు కానీ దెబ్బకు సదరు నిర్మాతలు వరస సినిమాల నిర్మాణం చేయలేకపోయారు

ఇప్పుడీ ఉదాహరణ చెప్పడానికి కారణం ఉంది. దర్శకుల ప్లానింగ్ లోపాలతో నిర్మాతలకు తడిసి మోపెడవుతున్న ఇలాంటి సంఘటనలు సౌత్ లో కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలతో తీస్తున్నప్పుడు పడుతున్న బాధలు అన్ని ఇన్ని కావు. శంకర్ తో 2.0 విషయంలో దీన్ని ప్రత్యక్షంగా అనుభవించిన లైకా సంస్థ ఇప్పుడు ఇండియన్ 2 విషయంలో ముందస్తు అగ్రిమెంట్ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

ఇది అఫీషియల్ గా చెప్పలేదు కానీ తతంగం అయిపోయిందట. ఇదే దారిలో టాలీవుడ్ లోనూ ఇలాంటి పద్ధతిని తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో మన తెలుగు అగ్ర నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఒకవేళ అదే కనక జరిగితే మంచి పరిణామమే. దర్శకుల కొన్నిసార్లుగా అనవసరంగా చేయించే దుబారాకు కాలయాపనకు బ్రేక్ వేసినట్టు అవుతుంది. చూద్దాం