Begin typing your search above and press return to search.
ఒక పాట కోసం కోట్లు .. శంకర్ సినిమా అంటే అంతే!
By: Tupaki Desk | 25 Oct 2021 9:40 AM GMTపాన్ ఇండియా సినిమాకి మెరుగులు దిద్దింది .. పరుగులు నేర్పింది శంకర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన సినిమాలో ప్రతి సన్నివేశం భారీతనంతో కనిపిస్తుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా ఆయన తన మార్కు మిస్ కానీయడు. కథాకథనాలు .. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిసి తెరపై నడుస్తుంటాయి .. ప్రేక్షకుల మనసులను గెలుస్తుంటాయి. ఇక పాత్రలను మలిచే తీరు కూడా చాలా డిఫరెంటే గా అనిపిస్తుంది. ఫైట్లను .. డాన్సులను .. పాటలను ఆయన బ్యాలెన్స్ చేసే తీరు గొప్పగా ఉంటుంది.
ఇక పాటల చిత్రీకరణ కోసం ఆయన పెట్టించే ఖర్చు చూస్తే కళ్లు మాత్రమే కాదు .. ఒళ్లంతా తిరగడం ఖాయం. శంకర్ సినిమాల్లో ఒక పాటకి పెట్టే ఖర్చుతో ఒక చిన్న సినిమాను తీయవచ్చని అంటారు. 'జీన్స్' సినిమాలో 5 నిమిషాల పాట కోసం ఆయన ప్రపంచవింతలన్నీటిని కవర్ చేస్తూ చిత్రీకరించిన పాట అందుకు నిదర్శనం. ఆ పాటకు ఎంత ఖర్చు అయ్యుంటుందనేది ఊహించుకోవచ్చు. ఇలా ఒక పాటకు ఎన్ని వైపుల నుంచి ప్రత్యేకతలను .. విశేషాలను జోడించాలనేది ఆయన కి బాగా తెలుసు.
అలాంటి శంకర్ ఇప్పుడు చరణ్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా కియారా అలరించనుంది. సాధారణంగా దిల్ రాజు ఒక పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతుంటాడు. కానీ శంకర్ ఎప్పుడు ఏక్కడ ఎంత ఖర్చు పెట్టించేది ఎవరికీ తెలియదు. ఆయన పెట్టించే ప్రతి పైసా తెరపై కనిపిస్తుందనే సంగతి వాళ్లకి తెలుసు. కానీ పాటకు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడమనేది అంత ఆషామాషీ విషయమేం కాదు. అలాంటిది శంకర్ పై గల నమ్మకంతో దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
చరణ్ - కియారాలపై ఈ పాటను పూణేలో చిత్రీకరిస్తున్నారు. ఒకే పాటను 12 రోజులకి పైగా చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. సాధారణంగా ఒక పాటను చిత్రీకరంచడానికి 3 రోజుల నుంచి 5 రోజుల సమయాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా సాంగ్ ను 12 రోజులకి పైగా ప్లాన్ చేశారని అంటున్నారు. పాటను ఇలా కూడా తీయవచ్చా? అనిపించే రేంజ్ లో ఈ పాట ఉంటుందని చెబుతున్నారు. అద్భుతమైన విజువల్స్ ఆశ్చర్యచకితులను చేస్తాయని చెబుతున్నారు. మొత్తానికి ఫస్టు షెడ్యూల్ ను పాటతో మొదలుపెట్టేసిన శంకర్, ఈ సినిమా భారీతనం ఎలా ఉంటుందనేది ముందుగానే ఒక హింట్ ఇచేశాడన్న మాట.