Begin typing your search above and press return to search.
శంకర్ కి తీవ్ర గాయాలు.. సరైన సమాచారమేదీ?
By: Tupaki Desk | 20 Feb 2020 4:47 AM GMTసెట్స్ లో ప్రమాదాలు రెగ్యులర్ గా చూసేవే అయినా .. ఇది ఊహించనిది. బహుశా గడిచిన కొన్ని ఏళ్లలో ఇంత ఘోర ప్రమాదం వేరొకటి జరగలేదేమో! 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి నేరుగా సహాయ దర్శకులు ఇతర బృందంపై పడింది. ఈ ఘటనతో భారతీయుడు 2 టీమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతకుమించి శంకర్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సహాయకులు మరణించడం.. పైగా ప్రమాద సమయంలో శంకర్ అక్కడే ఉన్నారని ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారని.. కాలు ఫ్యాక్చర్ అయ్యిందని రకరకాలుగా ప్రచారం సాగిపోవడంతో ఇందులో నిజం ఏమిటో తెలీని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై శంకర్ ట్విట్టర్ లోనూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
ముఖ్యంగా ప్రమాద సమయంలో శంకర్ స్పాట్ లోనే ఉన్నారా? ఆయనకు తీవ్ర గాయాలైన మాట నిజమేనా? అంటూ అభిమానుల్లో ఆందోళనతో కూడిన ఆరాలు మొదలయ్యాయి. ఇక స్పాట్ నుంచి సరైన సమాచారం అందించడంలో కోలీవుడ్ మీడియా దారుణంగా విఫలమైందనే చెప్పాలి. ఎక్కడో ఉన్న హైదరాబాద్ మీడియా వార్తలు కూడా తమిళ మీడియాలో కనిపించపోవడం ఆశ్చర్యకరం.
ఇకపోతే అసలు 150 అడుగుల ఎత్తు నుంచి పడిన క్రేన్ .. ఎక్కడ పడింది? అసలు ఆ సమయంలో శంకర్ అక్కడే ఉన్నారా? అని ఆరాతీస్తే.. శంకర్ కూడా సహాయదర్శకులతో అదే టెంట్ లో ఉన్నారట. ఆయనకు ఇంచి దూరంలో అది పడింది. అంటే సహాయకులను మృత్యువు వెంటాడింది. తృటిలోనే శంకర్ మిస్సయ్యారు. అయితే అతడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయన్న రిపోర్ట్ అందుతోంది. ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్ చాలా భయానకంగా జరిగింది. ఇందులో శంకర్ కి కావాల్సిన చాలా ఇంపార్టెంట్ సహాయకులు చనిపోయారని తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే విశ్వనటుడు కమల్ హాసన్ హుటాహుటీన స్పాట్ కి వెళ్లారు. ఆయన కన్నీరు మున్నీరు అయ్యారని ఇప్పటికే బయటపడిన ఫోటోలు చెబుతున్నాయి.
సౌత్ సినీపరిశ్రమలో శంకర్ అంటే ఒక సంచలనం. `బాహుబలి` తీయకముందే ఆయన పాన్ ఇండియా డైరెక్టర్. రెండు దశాబ్ధాల క్రితమే ఆయన ఈ ఫీట్ ని నిజం చేసి చూపించారు. సౌత్ లో సెన్సేషనల్ డైరెక్టర్ అంటే శంకర్. మేధోతనంతో సంచలనాలు సృష్టించే ఏకైక దర్శకుడిగా ఆయన అభిమానుల్ని సంపాదించుకున్నారు. బహుశా ఈ ఘటన గురించి తెలిశాక ఎస్.ఎస్.రాజమౌళి సైతం ఎంతో కలతకు గురి అయ్యి ఉంటారనడంలో సందేహమేం లేదు. భారతీయుడు లాంటి సంచలన చిత్రాన్ని రెండున్నర దశాబ్ధాల క్రితమే తెరకెక్కించిన ఘనుడు ఆయన. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తీస్తున్నారు అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో మరో సంచలనానికి శంకర్ తెర తీయబోతున్నారన్న అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఊహించని ఈ ప్రమాదంతో అభిమానులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఆయన తృటిలో తప్పించుకున్నారు అనగానే ఊపిరి పీల్చుకున్నారు.