Begin typing your search above and press return to search.

బాహుబ‌లిని కొట్టే సినిమా మొదలైంది

By:  Tupaki Desk   |   19 Sep 2015 5:30 PM GMT
బాహుబ‌లిని కొట్టే సినిమా మొదలైంది
X
సౌత్‌ లో అన్ని రికార్డుల్ని చెరిపేస్తూ టాప్ గ్రాస్ వ‌సూలు చేసిన సినిమా రోబో. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మ్యాజికల్ ఫిలిం అది. సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ ద్విపాత్రాభిన‌యం మెస్మ‌రైజ్ చేసింది. సంచ‌ల‌నాల రోబోకి స్టార్ రైట‌ర్ కం సైంటిస్ట్ సుజాత రంగ‌రాజ‌న్ బిహైండ్ ద స్ర్కీన్ ప‌నిచేశారు. అత‌డు శంక‌ర్‌ తో క‌లిసి ప‌నిచేసిన ఏ సినిమా అయినా పెను సంచ‌ల‌న‌మే అయ్యాయి. అయితే సుజాత రంగ‌రాజ‌న్ మ‌ర‌ణం త‌ర్వాత శంక‌ర్ తెర‌కెక్కించిన ఒకే ఒక్క సినిమా ఐ ఎలాంటి మ్యాజిక్ చేయ‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌బ‌డింది. రోబో మ్యాజిక్‌ ని ఐ రిపీట్ చేయ‌డంలో త‌డ‌బ‌డింది. ఫ‌లితం ఎప్ప‌టికీ రోబోనే టాప్ 1 సౌత్ ఫిలింగా మిగిలిపోయింది.

అయితే అలాంటి ఓ సినిమాని కొట్టే సినిమా వ‌స్తుందా? అన్న టాక్ మొద‌లైన‌ప్పుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సైలెంటుగా బాహుబ‌లి మొద‌లు పెట్టాడు. అది జ‌క్క‌న్న ఊహించ‌ని ఫ‌లితాన్ని ఇచ్చింది. సౌత్‌ - నార్త్‌లో ఉన్న అన్ని రికార్డుల్ని చెరిపేసే సినిమాగా చ‌రిత్ర కెక్కింది. దీంతో ఇప్పుడు శంక‌ర్‌ లో ప‌ట్టుద‌ల మ‌రింత పెరిగింది. కాంపిటీటివ్ స్పిరిట్ పెరిగింది. రాజ‌మౌళి బాహుబ‌లిని కొట్టే సినిమా తీయాల్సిన సంద‌ర్భం వ‌చ్చింది. అది ఒక్క రోబో శంక‌ర్‌ కి మాత్ర‌మే సాధ్యం కూడా. ఇప్పుడు అత‌డు రోబో సీక్వెల్ తెర‌కెక్కించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. 2016 జ‌న‌వ‌రి నుంచి ఆన్‌ సెట్స్ వెళ్ల‌డానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం శంక‌ర్ టాప్ టెక్నీషియ‌న్ ల‌ను రంగంలోకి దించారు. రైట‌ర్‌ గా సుజాత రంగ‌రాజ‌న్ ప్లేస్‌ లో జయ మోహ‌న్ అనే ఓ సీనియ‌ర్ రైట‌ర్‌ ని రంగంలోకి దించారు. రోబో సీక్వెల్‌ కి మీరే క‌థ అందించాలి .. అని ప‌ని అప్ప‌జెప్పారు.

250 కోట్ల బ‌డ్జెట్‌ తో రోబో 2ని తెర‌కెక్కించాల‌న్న‌ది ప్లాన్‌. అంటే ఇది బాహుబ‌లి, బాహుబ‌లి 2 రెండిటికీ క‌లిపితే ఎంత ఖ‌ర్చ‌వుతుందో అంత బ‌డ్జెట్ అన్న‌మాట‌. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్కు నిన్నటి నుండి అఫీషియల్‌ గా లాంచ్‌ చేశారు. మరి బాహుబలిని కొట్టేయ‌డం అంటే 600 కోట్ల పైన గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించ‌డ‌మే. రోబో2తో అది సాధ్య‌మ‌వుతుందా? లేదా? వెయిట్ అండ్ సీ.