Begin typing your search above and press return to search.
RC15 సినిమాకు శంకర్ టైటిల్ ఇదేనా?
By: Tupaki Desk | 8 Sep 2021 7:30 AM GMTరామ్ చరణ్ కథానాయకుడిగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నేడు లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియరా అద్వాణీ కథానాయిక. ఇప్పటికే చరణ్ - కియరా ఇద్దరిపైనా ఫోటోషూట్లు చేశారని ప్రచారమైంది. 08 సెప్టెంబర్ సినిమా లాంచ్ చేసి ఆరంభం చరణ్ - కియరా జంటపై పాటను చిత్రీకరిస్తారని కథనాలొచ్చాయి. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో దిల్ రాజు నిర్మిస్తున్నారు.
అయితే ఇలాంటి క్రేజీ చిత్రానికి శంకర్ ఎలాంటి టైటిల్ ని ఎంపిక చేశారు? అంటే... కాస్త వింతైన టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. శంకర్ ఈ చిత్రానికి `విశ్వంభర` అనే టైటిల్ పెట్టారట. చరణ్ ఫోటో షూట్ పూర్తి చేసినందున త్వరలో ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేస్తారు.
చరణ్ ని మునుపెన్నడూ చూడనంత విభిన్నంగా ఒక పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంలో శంకర్ చూపించనున్నారు. ఇందులో అతడు ఛాలెంజింగ్ యువ ముఖ్యమంత్రిగా కనిపిస్తారని ప్రచారం ఉంది. శంకర్ గతంలోనూ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలు చేశారు. కానీ ఈసారి టైటిల్ ఎంపిక కాస్త ఆలోచింపజేస్తోంది. ఇది మెగాభిమానుల్లోకి దూసుకెళుతుందా? మాస్ కి కనెక్టవుతుందా? అంటూ గుసగుస మొదలైంది.
విశ్వంభర .. వినేందుకు కాస్త గ్రాంధికంగా ఉంది. ఇలాంటివి దినపత్రికలు మ్యాగజైన్లలో హెడ్డింగ్స్ లోకి కూడా తెచ్చేందుకు ఇష్టపడరు. టైటిల్ సరళంగా ఉండాలి. లేదా మాసీ టచ్ తో ఉండాలి. ఇటీవల పాన్ ఇండియా చిత్రాలకు రెండక్షరాల టైటిళ్లు ట్రెండ్ అవుతున్నాయి. ఆ తరహాలో అయినా ఉండాలి. ఏదైనా శంకర్ గతంలో ఎంపిక చేసుకున్న ది జెంటిల్ మేన్- భారతీయుడు- ప్రేమికుడు - రోబో- ఒకే ఒక్కడు- 2.0 ఇవన్నీ క్యాచీగా సరళంగా ఉన్నాయి. విశ్వంభర అనేది వీటి కంటే ట్రెండీ గా అయితే లేదని ఒక సెక్షన్ విమర్శిస్తోంది. మరి శ్రీవెంకటేశ్వర అధినేత దిల్ రాజు దీనిపై ఏం ఆలోచిస్తున్నారో చూడాలి. టైటిల్ ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.