Begin typing your search above and press return to search.
2.0 విడుదలయ్యాకే ఆ సినిమా తియ్యండి
By: Tupaki Desk | 13 March 2018 10:16 AM GMTరోబోకి సీక్వెల్‌గా వస్తున్న సినిమా 2.0. రెండేళ్ల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన ఈ మూవీ... ఇప్పటికీ విడుదల కాలేదు. బాహుబలిని మించిన గ్రాఫిక్స్ చేయాలన్న తపనతో విడుదలకు వెనక్కి నెడుతూనే ఉన్నాడు శంకర్. ఇప్పుడు ఆ పరిస్థితి అతనికే ఎసరు తెచ్చింది. శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్లో రావాల్సిన సినిమా పనులకు బ్రేక్ వేసే స్థితి వచ్చింది.
రెండేళ్లుగా సా...గుతున్న సినిమా 2 పాయింట్ ఓ. అది ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడు నాలుగు విడుదల తేదీలు మారిపోయాయి. ఇప్పటికీ ఆ సినిమా ఎప్పుడో క్లారిటీ లేదు. షూటింగ్ పార్ట్ పూర్తయినప్పటికీ గ్రాఫిక్స్ ఇంకా సాగుతూనే ఉంది. బాహుబలిని మించేలా వీఎఫ్ ఎక్స్ ఉండాలన్నది శంకర్ టార్గెట్. అందుకోసం లాస్ ఏంజలస్ లోని ఓ సంస్థతో పని చేయిస్తున్నాడు. సగం పని అయ్యాక ఆ సంస్థ కూడా మూత పడింది. ఇప్పుడు మరో కంపెనీ పని అప్పజెప్పారు. ఈ ఏడాది సినిమా వస్తుందో రాదో అన్న అనుమానం నిర్మాతలకి వచ్చేసింది. ఒక మొబైల్ కంపెనీ వారు 2.0లో భారీగా పెట్టుబడులు పెట్టారట.
ఇంకా ఈ సినిమా విడలవ్వకముందే శంకర్ 1996లో వచ్చి సూపర్ హిట్ కొట్టిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ తీయడానికి సిద్దపడ్డాడు. అందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కు ఓ ముఖ్యమైన పాత్ర ఇచ్చాడట. కథ కూడా రాసేశాడని టాక్. 2.0లో పెట్టుబడులు పెట్టిన మొబైల్ కంపెనీ... తమ సినిమా విడుదలయ్యాకే ఇండియన్2 పనులు మొదలుపెట్టాలని షరతు పెట్టిందట. 2.0విషయం తేలకుండా మరో సినిమా మొదలుపెట్టద్దని శంకర్ కు చెప్పిందట. ఈ సినిమా సెల్ ఫోన్ బానిసవ్వడం అనే టాపిక్ చుట్టూ తిరుగుతుందట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు.