Begin typing your search above and press return to search.
చరణ్ - దిల్ రాజుల కోసం కోసం తన స్టైల్ మార్చుకుంటున్న శంకర్..
By: Tupaki Desk | 27 July 2021 4:30 PM GMTషో మ్యాన్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది చరణ్ కెరీర్ లో వస్తున్న 15వ సినిమా.. దిల్ రాజు బ్యానర్ కు 50వ చిత్రం. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే '#RC15' పై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులతో పాటుగా నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా చూసుకుంటున్నారు. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
దర్శకుడు శంకర్ ఓ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనేది మాత్రమే ఆలోచించాలని.. ఎప్పుడు పూర్తి చేస్తాడనే దాని గురించి మర్చిపోవాలని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తుంటాయి. సినిమాలోని ప్రతీ సన్నివేశం పర్ఫెక్ట్ గా రావాలని శ్రమించే శంకర్.. ఈ క్రమంలో సినిమా కోసం ఏళ్ల తరబడి సమయం తీసుకుంటారు. భారీ బడ్జెట్ తో భారీ సెట్టింగులు గ్రాండ్ విజువల్స్ కోసం తపించే శంకర్.. తన సినిమాలను సకాలంలో పూర్తి చేయడని అంటుంటారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ చిత్రాన్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారో అని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు.
అయితే '#RC15' విషయంలో శంకర్ తన మేకింగ్ స్టైల్ మార్చుకుంటున్నాడని తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించి 2022 సమ్మర్ నాటికి సినిమాని పూర్తి చేసి ఇస్తానని నిర్మాత దిల్ రాజు - హీరో రామ్ చరణ్ లకు శంకర్ ప్రామిస్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ప్రీ ప్రొడక్షన్ దశలోనే షూటింగ్ కోసం అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ లో సెట్స్ నిర్మాణం కూడా ఇప్పుడే స్టార్ట్ చేయనున్నారట. ఈ చిత్రాన్ని చెప్పిన సమయానికి పూర్తి చేసి.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో తదుపరి ప్రాజెక్ట్ ని వెంటనే మొదలు పెట్టాలని శంకర్ భావిస్తున్నారట.
శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా ఓ సినిమాకి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ అయిన 'అపరిచితుడు' చిత్రానికి ఇది హిందీ రీమేక్ గా రూపొందనుంది. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతి లాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'RC15' ని ముగించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. గత కొన్నేళ్లుగా రేసులో వెనుక బడిన అగ్ర దర్శకుడు.. చరణ్ సినిమాతో కచ్చితంగా సాలిడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. 'రోబో' తర్వాత శంకర్ కు ఆ స్థాయి సక్సెస్ అందలేదనే అనుకోవాలి. 'స్నేహితుడు' 'ఐ' '2.0' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా వసూళ్ళు రాబట్టలేకపోయాయి.
ఈ క్రమంలో శంకర్ ఎన్నో ఆశలు పెట్టుకొని కమల్ హాసన్ తో స్టార్ట్ చేసిన 'భారతీయుడు' సీక్వెల్ 'ఇండియన్ 2' మధ్యలోనే ఆగిపోయింది. ప్రొడ్యూసర్స్ కు నిర్మాతలకు తలెత్తిన వివాదంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. అసలు తిరిగి ప్రారంభం అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో 'RC15' విజయం శంకర్ కు కీలకమైంది. దీంతో ఎలాగైనా మళ్ళీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' 'ఆచార్య' చిత్రాల్లో నటిస్తున్న రామ్ చరణ్.. ఆగస్టు చివరి నాటికి ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత శంకర్ సినిమాతో బిజీగా మారనున్నాడు.