Begin typing your search above and press return to search.

ఇక్కడే శంకర్ దెబ్బేసాడు!

By:  Tupaki Desk   |   30 Nov 2018 9:16 AM GMT
ఇక్కడే శంకర్ దెబ్బేసాడు!
X
శంకర్ నుంచి ప్రేక్షకులు ఏ రేంజ్ లో సినిమాను ఆశిస్తారో నిన్న 2.0 ద్వారా తేటతెల్లమయ్యింది. టాక్ డివైడ్ గా ఉన్నప్పటికీ ఇంకే పోటీ లేకపోవడంతో పాటు ధియేటర్లన్ని ఇదే ఆక్రమించుకోవడంతో వసూళ్లు గ్రాండ్ గానే వస్తున్నాయి. ఇదలా ఉంచితే శంకర్ తన శైలికి భిన్నంగా ఇందులో చాలా కొత్త ప్రయోగాలు చేయడం ఒకరకంగా పాజిటివ్ గా అంత కన్నా ఎక్కువ నెగటివ్ గా ప్రభావం చూపిస్తోంది. ఫస్ట్ టైం శంకర్ సినిమాలో పాటలు లేవు. అసలు లేవా అంటే విలన్ కో స్యాడ్ సాంగ్ చివర్లో ఎండ్ టైటిల్స్ లో ఒక డ్యూయెట్ పెట్టారు. అంతే.

ఇది తప్ప 2.0లో ఈ సాంగ్ అద్భుతంగా ఉందే అనే అవకాశం రెహమాన్ ద్వారా శంకర్ కలిగించలేకపోయాడు. జెంటిల్ మెన్-ప్రేమికుడు- భారతీయుడు-ఒకే ఒక్కడు ఇలా ఏది తీసుకున్నా దేనికవే అల్టిమేట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్. అంత దాకా ఎందుకు యావరేజ్ అనిపించుకున్న యూత్ ఫుల్ మూవీ బాయ్స్ మ్యూజికల్ గా ఎప్పటికీ ఎవర్ గ్రీనే. పాటలకే అది ఆ మాత్రం ఆడింది అని చెప్పొచ్చు. నిరాశ పరిచిన ఐలో కూడా మంచి పాటలు మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. కాని 2.0లో మాత్రం ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసాడు. పైగా 20 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకున్న రేంజ్ లో పాట లేదనిపించిన మాట వాస్తవం.

అమీ జాక్సన్ రజని ఇద్దరూ పాటలో హుషారుగా లేకపోవడం చుట్టూ ఉన్న సెటప్ ఇంతకు ముందు రోబోలో చూసిన ఫీలింగే ఇవ్వడం వెరసి ఇది ప్లస్ కాదని తెలిసే శంకర్ తెలివిగా జనం ధియేటర్లలో కుర్చీలలో నుంచి వెళ్లిపోయే సమయంలో ఈ పాట పెట్టాడు. ఇది లేకపోయినా వచ్చిన నష్టమేమి ఉండేది కాదు. కథ పక్కదారి పట్టకుండా శంకర్ పాటలు పెట్టలేదు అని అభిమానులు సమర్దించుకోవచ్చు గాక. మరి రోబోలో ఏకంగా ఆరు పాటలు ఉన్నా అలాంటి ఫీలింగ్ ఏమి కలగలేదే. పైన చెప్పిన ఉదాహరణల్లో అవి సక్సెస్ కు హెల్ప్ అయ్యాయి తప్ప మైనస్ కాలేదు. ఏమో శంకర్ ఎలా స్కెచ్ వేసుకున్నాడో కానీ మొత్తానికి పాటలు లేని స్కెచ్ మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది