Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : శంకరాభరణం
By: Tupaki Desk | 4 Dec 2015 10:11 AM GMT‘శంకరాభరణం’ రివ్యూ
నటీనటులు- నిఖిల్, నందిత, అంజలి, సంపత్, పృథ్వీ, రావు రమేష్, సప్తగిరి, సుమన్, సితార తదితరులు
సంగీతం- ప్రవీణ్ లక్కరాజు
ఛాయాగ్రహణం- సాయి శ్రీరాం
నిర్మాత- ఎంవీవీ సత్యనారాయణ
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ- కోన వెంకట్
దర్శకత్వం- ఉదయ్ నందనవనం
రచయిత పేరు చూసి సినిమాలకు రావడం అరుదైన విషయం. రైటర్ గా అలాంటి ఇమేజ్ సంపాదించుకున్నాడు కోన వెంకట్. ఇక తన సినిమాల్లో ఏదో ఒక వైవిధ్యం ఉంటుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో కలిగించిన కథానాయకుడు నిఖిల్. వీళ్లిద్దరి కాంబినేషన్ క్రేజ్ కు తోడు హిందీలో విజయవంతమైన ఓ వైవిధ్యమైన సినిమాకు రీమేక్ గా తెరకెక్కడం.. టీజర్, ట్రైలర్ ఆసక్తి రేపడంతో ‘శంకరాభరణం’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.
కథ: గౌతమ్ (నిఖిల్) అమెరికాలో పెద్ద పారిశ్రామికవేత్త కొడుకు. అతను విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో స్నేహితులు చేసిన మోసం వల్ల తండ్రి దివాళా తీశాడని తెలుస్తుంది. కొన్ని రోజుల్లో రెండు మిలియన్ డాలర్లు కట్టకపోతే తండ్రి జైలుకెళ్లే పరిస్థితి ఉండటంతో బీహార్లోని తన తల్లి ఆస్తి అయిన శంకరాభరణం ప్యాలెస్ ను అమ్ముకుని రావడానికి బయల్దేరతాడు గౌతమ్. తీరా అక్కడికి వస్తే తన తల్లి బంధువులంతా అక్కడ తిష్ట వేసి ఉంటారు. వాళ్లందరినీ బుట్టలో వేసి ఆ ప్యాలెస్ ను అమ్మే ప్రయత్నంలో ఉండగా.. గౌతమ్ పై బీహార్ కిడ్నాపింగ్ గ్యాంగుల కళ్లు పడతాయి. ఓ గ్యాంగ్ అతణ్ని కిడ్నాప్ చేస్తుంది. మరి గౌతమ్ ఈ గ్యాంగుల బారి నుంచి ఎలా బయటపడ్డాడు? అతను శంకరాభరణం ప్యాలెస్ అమ్మాడా? తన తండ్రిని కష్టాల నుంచి గట్టిక్కించాడా? అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.
కథనం, విశ్లేషణ: మరో భాషలో విజయవంతమైన సినిమాను రీమేక్ చేయడం సేఫ్ బెట్ అనుకుంటారు కానీ... రీమేకులతో పెద్ద చిక్కులే ఉన్నాయి. ఉన్నదున్నట్లు తీస్తే జిరాక్స్ కాపీలా ఉందంటారు. నేటివిటీ ప్రాబ్లెం రావచ్చు. అలాగని మార్పులు చేసినా అవి పని చేస్తాయన్న గ్యారెంటీ లేదు. ఒరిజినల్ ను చెడగొట్టారంటారు. మూల కథ తీసుకుని నేటివిటీకి తగ్గట్లు చేసిన మార్పులు వర్కవుటై మన ప్రేక్షకుల్ని మెప్పించిన సినిమాలు చాలా అరుదు. గత కొన్నేళ్లలో అలాంటి సినిమా ఒక్క ‘గబ్బర్ సింగ్’ మాత్రమే కనిపిస్తుంది. ‘శంకరాభరణం’ను కూడా ఆ కోవలోకి చేర్చడానికి కోన వెంకట్ చాలా గట్టి ప్రయత్నమే చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. ‘ఫస్ గయారే ఒబామా’కు ‘శంకరాభరణం’ బ్యాడ్ రీమేక్ అని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు.
మాతృకలోని ఆత్మను పట్టుకోకుండా.. పేలని కామెడీని, పండని ఎమోషన్స్ ను నమ్ముకుని నానా కంగాళీ చేసింది కోన వెంకట్ టీమ్. హీరో పాత్ర మిగతా పాత్రలన్నింటినీ వాడేసుకోవడం.. అందరినీ బకరాల్ని చేసి తన పని పూర్తి చేయడం.. కోన వెంకట్ రాసే స్క్రిప్టుల్లో కామన్ గా కనిపించే పాయింట్. తన అరిగిపోయిన ‘టెంప్లేట్’ను పూర్తిగా పక్కనబెట్టేశానన్న కోన.. మళ్లీ ‘శంకరాభరణం’లోనూ ఆ టెంప్లేటే వాడాడు. కాకపోతే ఇక్కడ బ్రహ్మానందం లేడు. అతడి స్థానంలోకి బీహార్ కిడ్నాపింగ్ గ్యాంగులు వచ్చాయి. బీహార్ నేపథ్యం.. కిడ్నాపింగ్ గ్యాంగులు.. కొత్తగా అనిపిస్తాయి కానీ.. అంతకుమించి కథాకథనాల్లో అంతా కొత్తదనమైతే లేదు. ఫన్నీ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి కానీ.. ‘క్రైమ్ కామెడీ’ అన్న ట్యాగ్ కు తగ్గట్లు కామెడీ పండించలేకపోయారు.
‘ఫస్ గయారే ఒబామా’లో ఉండే సెన్సిబుల్ కామెడీ, థ్రిల్ ‘శంకరాభరణం’లో మిస్సయ్యాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ పండించడం ఒరిజినల్లో చేసిన మార్పులు సినిమాకు మైనస్ అయ్యాయి. నేరుగా కథలోకి వెళ్లకుండా హీరోను ఫ్యామిలీతో కనెక్ట్ చేయడం కోసం పెట్టిన సన్నివేశాలు చాలా బోరింగ్ అనిపిస్తాయి. కృత్రిమంగా అనిపించే ఎమోషనల్ సీన్స్ వల్ల సినిమాకు వచ్చిన ప్రయోజనమేమీ లేదు. సప్తగిరి ప్రథమార్ధమంతా కామెడీ కోసం శాయశక్తులా ప్రయత్నించాడు కానీ.. పెద్దగా నవ్వించలేకపోయాడు. ఫోర్స్డ్ గా అనిపించే సన్నివేశాలు.. ఇంకెప్పుడు అసలు కథ మొదలవుతుందో అన్న అసహనాన్ని కలిగిస్తాయి. ఇంటర్వెల్ ముందు హీరో కిడ్నాప్ అయ్యే వరకు వచ్చే సన్నివేశాలేవీ పండలేదు.
ద్వితీయార్ధంలో కిడ్నాప్ డ్రామా మొదలయ్యాక కొంచెం ఆసక్తి మొదలవుతుంది. ఐతే కిడ్నాప్ గ్యాంగులతో హీరో ఆడే డ్రామాలు సిల్లీగా అనిపిస్తాయి. ఇక్కడ లాజిక్కుల గురించి పట్టించుకోవడం మానేస్తే సినిమాను కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. కథనంలోని అప్ అండ్ డౌన్స్.. మిగతా పాత్రల సంగతి వదిలేస్తే... పర్సంటేజ్ పరమేశ్ గా 30 ఇయర్స్ పృథ్వీ ద్వితీయార్ధాన్ని తన భుజాల మీద మోశాడు. అతడి కామెడీ సినిమాలో పెద్ద రిలీఫ్. తనదైన టైమింగ్ తో పంచ్ ల మీద పంచ్ లు వేశాడు పృథ్వీ. ముఖ్యంగా ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్ లో పృథ్వీ చెలరేగిపోయాడు. ద్వితీయార్ధమంతా బోలెడన్ని క్యారెక్టర్లు, హడావుడి ఉన్నా.. సన్నివేశాల్లో బలం లేకపోవడం.. హీరో ఆడే డ్రామాల్లో లాజిక్ లేకపోవడంతో కథనం ఆసక్తికరంగా అనిపించదు. అంజలి పాత్ర ఆశించినంత ప్రత్యేకంగా ఏమీ లేదు. ఫస్టాఫ్ లో ఫెయిలైన సప్తగిరి సెకండాఫ్ లో కాస్త నవ్వించాడు. ఒకట్రెండు సన్నివేశాల్లో గిరి, హర్షల కామెడీ కూడా పండింది. దీని వల్ల ద్వితీయార్ధం.. ప్రథమార్ధంతో పోలిస్తే బెటర్ అన్న ఫీలింగ్ కలిగిస్తుంది.
నటీనటులు: నిఖిల్ కాన్ఫిడెంట్ గా నటించాడు. కానీ ఎన్నారై పాత్ర అనేసరికి దానికి సెపరేట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలన్న ఆలోచనతో తెచ్చిపెట్టుకున్న ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ ట్రై చేయడమే చికాకు పెడుతుంది. ఇందులో కన్సిస్టెన్సీ కూడా లేదు. కొన్ని సన్నివేశాల్లో మామూలుగా నటించాడు కానీ... కొన్నిచోట్ల తనది ఎన్నారై పాత్ర అని గుర్తు తెచ్చుకుని ఆ బాడీ లాంగ్వేజ్ లోకి మారిపోయాడు. నందిత తన ప్రత్యేకత చూపించే అవకాశం దక్కలేదు. అంజలి కనిపించేది ఓ 20 నిమిషాలే. ఆమె పాత్ర మొదలైనపుడు ఆసక్తికరంగానే అనిపిస్తుంది కానీ.. తర్వాత తేల్చేశారు. ఆమె మీద తీసిన పాట బావుంది. సంపత్ రాజ్ బాగా చేశాడు. పృథ్వీ తన పంచ్ పవర్ తో పరమేశ్ క్యారెక్టర్లో అదరగొట్టాడు. సప్తగిరి కొంచెం నవ్వించి.. ఎక్కువ చికాకు పెట్టాడు. రావు రమేష్, సుమన్, సితార.. వీళ్లంతా మామూలే.
సాంకేతికవర్గం: సినిమాలో సంగీతానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ప్రవీణ్ లక్కరాజు పాటల్లో అంజలి మీద వచ్చే సాంగ్ ఒక్కటి ఆకట్టుకుంటుంది మిగతా పాటలు సోసోగా అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం బావుంది. బీహార్ నేటివిటీని బాగా క్యాప్చర్ చేసింది అతడి కెమెరా. పేరుకు చిన్న సినిమానే కానీ.. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఓ పెద్ద సినిమా తరహాలో భారీ తారాగణంతో సినిమాను రిచ్ గానే తెరకెక్కించారు. సినిమాకు అన్నీ తానై వ్యవహరించిన కోన వెంకట్ తన స్థాయికి తగ్గట్లు పెన్ పవర్ చూపించలేకపోయాడు. కథనం విషయంలో నిరాశ పరిచాడు. సెకండాఫ్ లో అక్కడక్కడా కోన సెన్సాఫ్ హ్యూమర్, అతడి పంచ్ పవర్ కనిపిస్తుంది కానీ.. ఓవరాల్ గా మాత్రం నిరాశే. ‘‘ఈ ఇంటికి పట్టింది బూజు కాదు, బంధువులు. వాళ్లను దులపడం అంత ఈజీ కాదు’’.. ఇలా అక్కడక్కడా డైలాగులు పేలాయి.
చివరగా: శంకరాభరణం... పేరు గొప్ప!
రేటింగ్- 2/5