Begin typing your search above and press return to search.

లీక్‌ గురూ: నిఖిల్‌ డ్యాన్సులు చంపేశాడు

By:  Tupaki Desk   |   8 Sept 2015 8:05 PM IST


యంగ్‌ హీరో నిఖిల్‌ స్పీడుమీదున్నాడు. స్వామిరారా - కార్తికేయ - సూర్య వర్సెస్‌ సూర్య .. మూడు విలక్షణమైన సినిమాలతో హిట్లు కొట్టి సత్తా చాటుకున్నాడు. అదే ఊపులో స్టార్‌ రైటర్‌ కం ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌ తో టైఅప్‌ పెట్టుకుని శంకరాభరణం చేస్తున్నాడు. టైటిల్‌ పాత సినిమాదే కానీ, అల్ట్రా మోడ్రన్‌ స్క్రిప్టు తో తెరకెక్కుతున్న చిత్రమిది. దారి దోపిడీలు, దొంగతనాలు బేస్‌ చేసుకుని కోన అల్లుకున్న కథ ఇది. అందుకే ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.

అయితే ఈ సినిమా ఆన్‌సెట్స్‌ ఉండగానే నిఖిల్‌ వీడియో ఒకటి ఆన్‌ లైన్‌ లో లీకైపోయింది. ఎవరో సెల్‌ ఫోన్‌ లో షూట్‌ చేశారో ఏమో.. నిఖిల్‌ హుషారుగా స్టెప్పులేస్తున్న సాంగ్‌ మేకింగ్‌ లీక్‌ అయ్యింది. ఈ వీడియోలో నిఖిల్‌ డ్యాన్సులు అదరిపోయాయి. మునుపటి నిఖిల్‌ తో పోలిస్తే ఇప్పటి నిఖిల్‌ పూర్తిగా స్టయిలిష్‌ గా కనిపిస్తున్నాడు. ఆర్య రేంజులో మ్యాజికల్‌ స్టెప్పులు వేస్తూ అదరగొట్టేశాడు. నల్లరంగు షర్ట్ లు, ప్యాంటు, టక్కు టై అదిరిపోయింది ఈ లుక్‌. శంకరాభరణం కామెడీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌. రొమాన్స్‌ అదనపు బోనస్‌. లీకైన వీడియోని బట్టి నిఖిల్‌ డ్యాన్సులు డబుల్‌ బొనాంజ.