Begin typing your search above and press return to search.
కోన కోత పెట్టడానికి సిద్ధమయ్యాడా?!
By: Tupaki Desk | 7 Dec 2015 8:04 AM GMTసినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకొందంటే మేకర్స్ కి వెంటనే గుర్తుకొచ్చేది... ట్రిమ్మింగ్. సినిమా ఎక్కడైనా ల్యాగింగా అనిపిస్తోందా? ప‌్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారా? అని ఆరా తీయడం, ఆ వెంటనే కోతలు పెట్టడంలాంటివి చేస్తుంటారన్నమాట. ఇటీవల అలా రిలీజ్ తర్వాత ట్రిమ్ చేసుకొన్న సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా కోన వెంకట్ కూడా తన శంకరాభరణంకి కటింగులు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడట. ఫస్ట్ హాఫ్ లో బోరింగ్ అనిపించే సన్నివేశాల్ని తీసేస్తే ఎలా ఉంటుందని ఆయన టీమ్ తో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది.
సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ నిఖిల్ కి ఉన్న క్రేజ్ వల్ల మంచి ఓపెనింగ్సే వచ్చాయి. ఇప్పటిదాకా నిఖిల్ చేసిన అన్ని సినిమాలకంటే ఎక్కువ ఓపెనింగ్స్ ఈ సినిమాకే వచ్చాయట. శంకరాభరణంలాంటి ఫేమస్ పేరు పెట్టడమే ఆ స్థాయి ఓపెనింగ్స్ కి కారణం అని చెప్పొచ్చు. పైపెచ్చు సినిమాలో అక్కడక్కడా కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ టాక్‌తో బెంగాల్ టైగర్ వచ్చేవరకు అలా నిలబెట్టాలని కోన విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మేరకు సినిమాలో 12 నిమిషాల నిడివిని తగ్గించి సినిమాని మరింత క్రిస్పీగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిసింది. మరి కోన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. మరోపక్క నిఖిల్ ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేశాడు. సోమవారం సక్సెస్ మీట్ జరిగిన తర్వాత హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లకి వెళ్లి ప్రేక్షకుల్ని పలకరించాడు. ఆడియెన్స్ ఫీడ్ బ్యాక్ - కలెక్షన్లపై నిఖిల్ సంతృప్తిగానే ఉన్నాడు.