Begin typing your search above and press return to search.

హోస్ లోకి వచ్చి హగ్గులపై షాకిచ్చిన సిరి తల్లి

By:  Tupaki Desk   |   26 Nov 2021 4:08 AM GMT
హోస్ లోకి వచ్చి హగ్గులపై షాకిచ్చిన సిరి తల్లి
X
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగింపు దశకు వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 82వ రోజులోకి అడుగు పెడుతున్న ఈ రియాలిటీ షో.. ఈ వారంతో పన్నెండో వారం ముగియనుంది.

ఇప్పటివరకు జరగాల్సిన రచ్చలన్ని పెట్టేసిన బిగ్ బాస్.. చివరి వారాల్ని ఇంటి సభ్యులు మధ్య తరచూ వచ్చే గొడవలకు భిన్నంగా.. వారి ఇంటి వారిని హౌస్ లోకి పంపిస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన రెండో రోజులుగా సాగుతున్న ఈ సర్ ప్రైజ్ ఎంట్రీల్లో ఇప్పటివరకు కాజల్ భర్త.. కుమార్తె.. మానస్..సిరి.. సన్నీ తల్లులు హౌస్ లోకి రావటం చూశాం.

వారి ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లో కొత్త సందడి వాతావరణం నెలకొంది. దీనికి భిన్నంగా సిరి తల్లి వ్యవహరించారని చెప్పాలి. మానస్ కు ప్రియాంకకు మధ్య స్టోరీ తెలిసిందే అయినా.. మానస్ తల్లి మాత్రం ఆ విషయాల్ని పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తూ.. సందడి వాతావరణాన్ని క్రియేట్ చేసి వెళ్లిపోయారు.

అందుకు భిన్నంగా సిరి తల్లి మాత్రం రావటంతోనే.. తన కుమార్తె హగ్గుల వైఖరిపై తనకున్న కంప్లైంట్ ను చెప్పేశారు. తండ్రిలా.. సోదరుడిలా సిరిని షణ్ముఖ్ చూసుకుంటున్నాడని చెబుతూనే.. ఇద్దరు తరచూ హగ్గులు చేసుకోవటాన్ని మాత్రం తప్పు పట్టారు.

తల్లి నుంచి వచ్చిన కామెంట్లకు సిరి ఫీల్ కావటమే కాదు.. తల్లిని పక్కకు తీసుకెళ్లి.. అలా మాట్లాడటం తప్పని చెప్పే ప్రయత్నం చేసింది. ఆ సమయంలోనూ సిరి తల్లి.. తండ్రి.. సోదరుడు.. స్నేహితుడిగా షణ్ముఖ్ వ్యవహరిస్తున్నట్లు చెప్పగా.. తండ్రి.. సోదరుడు లాంటి పోలికలు వద్దని.. మంచి ఫ్రెండ్ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. సిరి తల్లి మాత్రం సమాధాన పడలేకపోయారు. తన అసంతృప్తిని దాచుకునే ప్రయత్నం చేయలేదు. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా ముఖం మీదనే చెప్పేశారు. దీంతో సిరి ఫీల్ అయ్యింది.

నిజానికి ఈ సీజన్ లో షణ్ము.. సిరి మధ్య ఎపిసోడ్ మొదట్లో క్యూట్ గా అనిపించినా.. రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య బాండింగ్ అంతకంతకూ పెరిగిపోవటం తెలిసిందే. అయితే.. వీరిద్దరికి బిగ్ బాస్ హౌస్ బయట.. రియల్ ప్రపంచంలో అప్పటికే వేరే వారితో ఎంగేజ్ అయిపోవటం.. త్వరలో పెళ్లి చేసుకోవాల్సి ఉండటం తెలిసిందే.

అలాంటిది క్యూట్ ఫ్రెండ్ షిప్ వరకు ఓకే కానీ.. అదే పనిగా గాఢమైన హగ్గులపై ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. మీమ్స్ తో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

సిరి చిన్న వయసులోనే తండ్రి చనిపోయారని.. తాను ఒంటరిగా కష్టపడి పిల్లల్ని పెద్ద చేశానని.. సొంతంగా పాన్ షాప్ పెట్టుకొన్న వైనాన్ని సిరి తల్లి ఇంటి సభ్యులతో తన లైఫ్ గురించి వివరించారు. ఆ సమయంలో తాను ఎన్నో మాటలు పడినట్లుగా పేర్కొన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సిరి తల్లి చేసిన వ్యాఖ్యలకు షణ్ముఖ్ నొచ్చుకోవటంతో పాటు.. బాగానే ఫీలయ్యాడు. తనకు తాను ఒంటరిగా కూర్చొని.. బిగ్ బాస్ తో.. సిరికి తానెంతో సపోర్టు చేశానని.. కానీ సిరి తల్లి చేత మాటలు పడినట్లుగా ఫీలయ్యాడు. తాను తప్పు చేసినట్లుగా వాపోయి.. సిరి వాళ్ల అమ్మ అన్నిమాటలు అంటున్నప్పుడు.. ఆమెను వారించే ప్రయత్నం చేయలేదని బాధ పడ్డాడు.

కానీ.. తల్లిని లోపలకు తీసుకెళ్లిన సిరి.. హగ్గులపై అలా మాట్లాడకూడదంటూ నచ్చజెప్పిన విషయం షణ్ముఖ్ కు తెలీక పోవటంతో ఇలా బాధ పడటాన్నిఅర్థంచేసుకోవచ్చు. తల్లి వెళ్లిన తర్వాత షణ్ముఖ్ వద్దకు వచ్చి.. మళ్లీ హగ్గుల ఎపిసోడ్ ను సిరి షురూ చేయగా.. షణ్ముఖ్ మాత్రం కామ్ గా ఉండిపోయాడు.

సిరి చర్యలకు రెస్పాండ్ కాకుండా ఉండటం గమనార్హం. మొత్తంగా సిరి తల్లి హౌస్ లోకి వచ్చి.. బయట వారిద్దరి గురించి ఏమనుకుంటున్నారన్న విషయాన్ని శాంపిల్ చూపించారని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక.. ఈ హగ్గుల జంటకు ఎదురయ్యే సీన్ కు ట్రైలర్ చూపించిన సిరి తల్లి తీరుకు వారిద్దరు ఫీల్ కావటం చూస్తే.. బిగ్ బాస్ తర్వాత కూడా వీరి వ్యవహారం సోషల్ మీడియాలో నలగనుందా? అన్న సందేహం రాక మానదు.