Begin typing your search above and press return to search.
వరల్డ్ బెస్ట్ లిస్ట్ లో సప్తగిరి, శాంతి..
By: Tupaki Desk | 7 Jun 2016 11:54 AM GMTతెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు - సినిమా థియేటర్లకు ఉన్న ఇంపార్టెన్స్ అలాంటి ఇలాంటిది కాదు. దేశంలో బాలీవుడ్ తర్వాత రెండో అతి పెద్ద సినిమా రంగం టాలీవుడ్. సినీ చరిత్ర ప్రారంభమైన నాటి నుంచే ఇక్కడ సినిమా థియేటర్లకు ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడంటే మల్టీప్లెక్సుల హడావిడిలో పడిపోయి.. సింగిల్ స్క్రీన్లపై చిన్న చూపు ఏర్పడింది కానీ.. వీటి నిర్మాణానికి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాదు,. ప్రమాణాలను పాటించేవారి. ముఖ్యంగా డిజైనింగ్ లో అయితే ప్రతీ థియేటర్ కి విభిన్నత ఉంటుంది. అంతగా ఆకట్టుకోవడం మన థియేటర్ల స్పెషాలిటీ.
హూబిట్జ్-జోచె అనే ఇద్దరు ఫోటోగ్రాఫర్లు.. ప్రపంచదేశాలు అన్నీ తిరిగేసి ప్రఖ్యాతమైన కట్టడాల ఫోటోలను ప్రకటిస్తూ ఉంటారు. ఇందులో వాటి నిర్మాణ శైలినే ప్రధానంగా తీసుకుంటారు. జూబిట్జ్-జోచెల ఫోటోగ్రఫీకి బోలెడంత ఆదరణ ఉంది. రీసెంట్ గా దక్షిణ భారత్ తోపాటు, ప్రపంచవ్యాప్తంగా సినిమా హాల్స్ నిర్మాణాలపై ఈ ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ప్రత్యేకమైన ఫోటోగ్రాఫిక్ వర్క్ ను రిలీజ్ చేశారు. సీఎన్ ఎన్ ఈ లిస్ట్ ను తన వెబ్ సైట్ లో స్పెషల్ స్టోరీగా ప్రచురించింది. ఇందులో హైద్రాబాద్ లో ఉన్న సప్తగరి - శాంతి థియేటర్లకు స్థానం లభించింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సప్తగిరి 70ఎంఎం - నారాయణ గూడ చౌరస్తాలో ఉన్న శాంతి 70ఎఎం థియేటర్లు.. వాటి నిర్మాణ శైలి ఆధారంగా ఈ లిస్ట్ లో ప్లేస్ సంపాదించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక థియేటర్లు మూతపడ్డంతో ఈ లిస్ట్ లో కేవలం ఈ రెండు థియేటర్లకు మాత్రమే చోటు దక్కిందని, లేకుంటే రెండు రాష్ట్రాల్లో మరెన్నో థియేటర్లకు స్థానం లభించేదని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.!