Begin typing your search above and press return to search.

ల‌వ్ లీగా ఒక జాబిల‌మ్మ అలా క‌ల‌లోకి వ‌చ్చింది

By:  Tupaki Desk   |   21 May 2021 2:30 AM GMT
ల‌వ్ లీగా ఒక జాబిల‌మ్మ అలా క‌ల‌లోకి వ‌చ్చింది
X
క‌న్న‌డ బ్యూటీ శాన్వి శ్రీ‌వ‌త్సవ `ల‌వ్ లీ` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. క్యూట్ లుక్స్ తో యువ‌త‌రాన్ని ఆక‌ర్షించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత కెరీర్ ప‌రుగులో ఆశించినంత పెద్ద రేంజును అందుకోలేక‌పోయింది.

విష్ణు స‌ర‌స‌న ఆర్జీవీ డైరెక్ష‌న్ లో రౌడీ అనే చిత్రంలో నటించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో శాన్వి చెల‌రేగి అందాల్ని ఆర‌బోసింది. అయినా టాలీవుడ్ లో ఆశించిన కెరీర్ ద‌క్క‌లేదు. `అత‌డే శ్రీ‌మ‌న్నారాయ‌ణ` అనే బ‌హుభాషా చిత్రంలో నాయిక‌గా న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో త్రిశూలం.. క‌స్తూరి అనే రెండు సినిమాల్లో న‌టిస్తోంది.

శాన్వీ గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ స‌ర్కిల్స్ కి దూరంగానే ఉంటోంది. అయితే సోష‌ల్ మీడియాల్లో త‌న అభిమానుల కోసం అప్ డేట్స్ చెబుతూ ట‌చ్ లో ఉంది. ఇటీవ‌ల ర‌క‌ర‌కాల డిజైన‌ర్ ఫోటోషూట్ల‌ను షేర్ చేసి ఆక‌ట్టుకుంది. శాన్వి తాజా ఫోటోషూట్ అభిమానుల్లోకి వైర‌ల్ గా దూసుకెళుతోంది.

బ్రాండ్ న్యూ డిజైన‌ర్ శారీలో శాన్వి సిగ్గుల మొగ్గ‌వుతూ అలా గుండె గిచ్చేసే స్మైలిస్తూ ఎంతో అందంగా క‌నిపించింది. అలా జ‌డ‌లో గులాబీని తురుముతూ స్మైలీ లుక్ లో క‌నిపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లో క్యాప్చుర్ చేసిన ఈ ఫోటో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఒక ల‌వ్ లీ జాబిల‌మ్మ క‌ల‌లోకి వ‌చ్చిన‌ట్టుగా ఉంది! అంటూ అభిమానులు ఖుషీగా పోయెట్రీ చెబుతూ ప‌ర‌వ‌శించిపోతున్నారు..! శాన్వీ ఇదే హుషారులో మ‌ళ్లీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.