Begin typing your search above and press return to search.
ఆ స్టార్ భార్యలు ఉన్నారు చూశారు
By: Tupaki Desk | 2 July 2017 5:48 AM GMTఇంటర్నెట్ లేని రోజులలో స్టార్లు గురించి వేరే వాళ్ళు రాసేవారు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరి బ్లాగ్లు వారే రాసుకుంటున్నారు. ఎవరి ప్రచారం వాళ్ళే చేసుకుంటున్నారు. హీరోలకి హిరోయిన్లకు ఎలాగూ ఫాలోయింగ్ ఉంటుంది ఎక్కడుకు వెళ్ళినా. మరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అంటే హీరో భార్య కూడా కొంత ఫాలోయింగ్ ఉంటుంది కదా మరి. అలా అని హీరోయిన్ భర్తలకు ఉండదులేండి. ఇప్పుడు మన తెలుగులో కొంతమంది నటులు భార్యల సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్న క్రేజ్ గురించి తెలుసుకుందాం.
ముందుగా మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ గురించి చెప్పాలి. మహేశ్ ఎక్కడకు వెళ్ళాడు సెలువులలో పిల్లలను ఎక్కడు తీసుకొనివెళ్ళాడు, ఇంకా పిల్లలు గౌతమ్ - సితార ముద్దుగొలిపే ఫోటోలు షేర్ చేయడం.. వగైరా వగైరాలతో ఫేస్ బుక్ - ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులుకు చేరువవుతోంది ఈవిడ. మరో స్టార్ భార్య మెగా ఇంటి కోడలు ఉపాసన గురించి కూడా చెప్పుకోవాలి. రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఎంత తక్కువగా ఉంటాడో ఉపాసనా అంతా ఎక్కువగా ఉంటుంది. ఆమె అపోలోకు సంబంధించిన అన్ని వివరాలు ఇంకా రామ్ చరణ్ సరదాలు వాళ్ళు వెళ్ళే టూర్లు తమ కుటుంబ బంధాలు గురించి పోస్టులు చేసి.. ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
మరో మాజీ హీరోయిన్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అంతే. ఆమె పవన్ కల్యాణ్ నుండి విడిపోయినా అభిమానులలో ఇప్పటికీ వదిన అంటూనే ఉంటారు. ఇక ఈమె కూడా వాళ్ళ పిల్లలు అద్య - అకీరా గురించి.. అప్పుడుప్పుడు సొసైటి లో జరిగే సంఘటనలు గురించి.. ఆమె అభిప్రాయాలూ ట్విట్టర్లో చెబుతూ అభిమానులలో ఎప్పుడు ఏదో ఒక విషయంగా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇంకా చివరిగా ఒక హాట్ మామ్ గురించి చెప్పుకోవాలి. ఈ మధ్యనే ఈమె మిసెస్ ఇండియా ఫైనల్ రౌండ్ వరకు కూడా వెళ్లింది. ఆమె ఎవరో కాదు నటుడు అజయ్ భార్య శ్వేత రావూరి. ఈమె వర్కవుట్ ఫోటోలు - ఫోటోషూట్లు పెట్టి చాలామందికి ఫిట్నెస్ గోల్స్ ఇస్తూ ఉంటుందిలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/