Begin typing your search above and press return to search.
సర్దార్ విలన్ సమస్య ఏంటంటారు?
By: Tupaki Desk | 10 April 2016 7:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి.. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. వీకెండ్ పూర్తయ్యే వరకూ ఈ జోష్ ఇలానే ఉండడం ఖాయమే. ఆ తర్వాత నిలబడ్డంపైనే సినిమాని ఏ కేటగిరీ చేర్చాలో అనే విషయాన్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ మూవీలో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన అంశాల్లో విలన్ రోల్ కూడా ఉంది.
ఈ మూవీతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు శరద్ కేల్కర్. హిందీ సీరియల్స్ తో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించే ఈ యాక్టర్ తో.. విలన్ రోల్ చేయించారు. రాజా భైరవ్ సింగ్ పాత్రలో ఇతగాడు సూపర్బ్ గా ఉన్నాడనే చెప్పాలి. తన ట్యాలెంట్ తో.. తనకు స్కోప్ ఉన్న మేరకు పాత్రను పండించేందుకు బాగానే ప్రయత్నించాడు. అయితే.. శరద్ పెదాలకు - పలికే మాటలకు ఎక్కడా సింక్ అవలేదు.
సినిమాలో ఓ చోట 'ఎక్కడో సింక్ కొడుతోంది' అంటాడు శరద్ కేల్కర్. కానీ సినిమా అంతా సింక్ కొట్టేశాడీయన. సర్దార్ లో తెలుగు డైలాగులకు శరద్ కేల్కర్ లిప్ సింక్ సెట్టవ్వలేదు. అందుకు కారణం ఏంటంటే.. శరద్ కేల్కర్.. హిందీలో మాత్రమే డైలాగులు చెప్పాడట. దానికే తెలుగు డబ్బింగ్ వేశారట చాలా చోట్ల. హడావిడి ఫినిషింగ్ లో భాగంగా జరిగినదే ఇదంతా అంటన్నారు సినీ జనాలు.