Begin typing your search above and press return to search.

బీబీ-3: బాల‌య్యను ఢీకొట్ట‌బోతున్న‌ది అత‌నే!

By:  Tupaki Desk   |   29 March 2021 5:09 AM GMT
బీబీ-3: బాల‌య్యను ఢీకొట్ట‌బోతున్న‌ది అత‌నే!
X
నంద‌మూరి ఫ్యాన్స్ బీబీ-3 కోసం ఎంత‌గా వెయిట్ చేస్తున్నారో వాళ్ల‌కు మాత్ర‌మే తెలుసు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ టైటిల్ అనౌన్స్ చేయ‌కుండా.. వాళ్ల‌ను ఊరిస్తూనే ఉన్నాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి. ఆఖ‌రికి రిలీజ్ డేట్ కూడా ఏనాడో ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. పేరు మాత్రం రివీల్ చేయ‌డం లేదు.

ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా టైటిల్ ను మహా శివరాత్రి సందర్భంగా ప్ర‌క‌టిస్తార‌నే ప్ర‌చారం సాగింది. కానీ.. శివరాత్రి దాటిపోయి చాలా రోజులు అయినప్పటికీ.. ఇంకా టైటిల్ మాత్రం ప్రకటించలేదు. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఉగాదికి ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో స‌మ‌స్య చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. అదే.. మెయిన్ విల‌న్ సెల‌క్ష‌న్‌. బీబీ-3లో చాలామంది విల‌న్లు ఉన్నార‌ని స‌మాచారం. వారిలో ప‌లువురిని సెల‌క్ట్ చేసిన‌ప్ప‌టికీ.. మెయిన్ విల‌న్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం క‌న్ఫాం కాలేదు. ప‌లువురిని అప్రోచ్ అయిన‌ప్ప‌టికీ.. కుద‌ర్లేదు. దీంతో.. చివ‌ర‌కు కోలీవుడ్ స్టార్ శ‌ర‌త్ కుమార్ ను ఫైన‌ల్ చేసినట్టు స‌మాచారం. గ‌తంలో బోయ‌పాటి సినిమాలో న‌టించారు శ‌ర‌త్ కుమార్‌. ఆ సాన్నిహిత్యంతోనే విల‌న్ పాత్ర‌కు ఓకే చెప్పార‌ని తెలుస్తోంది.

బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేష‌న్లో రాబోతున్న మూడో చిత్ర‌మిది. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన సింహా, లెజెండ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో ఈ చిత్రంపై అభిమానులో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. థమన్ సంగీతం అందిస్తున్నారు. స‌మ్మ‌ర్ లో స్లాట్ బుక్ చేసిన ఈ చిత్రాన్ని మే 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.