Begin typing your search above and press return to search.
విజయ్ సినిమాను టేకప్ చేసిన పవన్ ఫ్రెండు
By: Tupaki Desk | 25 Jun 2017 6:50 AM GMTశరత్ మరార్ నిర్మాతగా కంటే పవన్ మిత్రుడిగానే ఎక్కువ పేరు సంపాదించాడు. నిర్మాతగా అతను చేసిన సినిమాలేవీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తొలి సినిమా ‘గోపాల గోపాల’ అయినా ఏవరేజ్ అనిపించుకుంది కానీ.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ సినిమాలు బయ్యర్లకు.. ప్రేక్షకులకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ‘కాటమరాయుడు’ దెబ్బకు మరార్ ఇప్పుడిప్పుడే ఇంకో సినిమా చేయడనే అనుకున్నారంతా. ఐతే మరార్ ఆశ్చర్యకరంగా ఓ తమిళ డబ్బింగ్ సినిమాను తెలుగులో అందిస్తుండటం విశేషం. అది పవన్ కళ్యాణ్ కు స్నేహితుడైన విజయ్ సినిమా కావడం విశేషం.
‘రాజా రాణి’ ఫేమ్ అట్లీ దర్శకత్వంలో విజయ్ ‘మెర్సల్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తెలుగు వెర్షన్ కు ‘అదిరింది’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా శరత్ మరారే ప్రకటించడం విశేషం. ఈ సినిమాతో తాను అసోసియేట్ అవుతున్నట్లుగా మరార్ వెల్లడించాడు. పవన్ తో భారీ సినిమాలు తీసిన మరార్.. ఇలా ఓ డబ్బింగ్ సినిమాను టేకప్ చేయడం విశేషమే. ‘తెరి’ (తెలుగులో పోలీసోడు) తర్వాత విజయ్-అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. దీనికి మన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ‘తెండ్రాల్ ఫిలిమ్స్’ ప్రొడ్యూస్ చేసిన వందో సినిమా ఇది కావడం విశేషం. రెహమాన్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత.. కాజల్.. నిత్యా మీనన్ నటిస్తున్నారు. ఇది జల్లికట్టు నేపథ్యంలో సాగే సినిమా అని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/