Begin typing your search above and press return to search.
కాదని చెప్పినా.. పవన్ దేవుడే!!
By: Tupaki Desk | 13 Feb 2017 3:29 AM GMTపవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితులు చాలా తక్కువమందే ఉంటారు. వారిలో నిర్మాత శరత్ మరార్ కూడా ఒకరు. ప్రస్తుతం పవన్ అమెరికా పర్యటనలో ఉన్నా.. శరత్ మరార్ కూడా వెంట వెళ్లాడు. పవన్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పడంతో పాటు.. దేవుడు అంశంపై పవర్ స్టార్ స్పందన కూడా చెప్పాడు ఈ నిర్మాత.
పవన్ తో తనకు సుదీర్ఘమైన అనుబంధం ఉందని చెప్పిన శరత్ మరార్.. పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన జానీ సినిమా నుంచి కలిసి పని చేశామని చెప్పాడు. జానీ మూవీకి పవన్ హీరో మాత్రమే కాదు.. దర్శకుడు.. కథా రచయిత.. స్క్రీన్ ప్లే రైటర్ కూడా. ముందుగా రూపాయి కూడా పారితోషికం తీసుకోని పవన్.. కానీ ఆ సినిమా నిరుత్సాహపరచడంతో.. హాఫ్ మిలియన్ డాలర్స్(ఇప్పటి విలువ 3.8 కోట్ల రూపాయలు)కు చెక్ ఇస్తే.. నష్టపోయిన వారికి ఇచ్చేయమని చెప్పిన.. నిజంగా దేవుడే అన్నాడు శరత్ మరార్.
అలాగే గోపాలా గోపాలా చిత్రం తీసేటపుడు.. శ్రీకృష్ణ పరమాత్ముడిగా విశ్వరూపాన్ని చూపే సీన్ ని పవన్ చేయాల్సి ఉండగా.. 'నేను దేవుడి కాదు.. షూటింగ్ ఆపేయండి' అంటూ ఆ రోజు షూట్ క్యాన్సిల్ చేశాడట పవన్. తాను దేవుడిగా భావించుకోలేకపోతున్నానని అన్నాడట పవన్. శరీరంలోని అన్ని అవయవాలు.. పంచేంద్రియాలు.. సరైన స్థితిలో ఉంచుకోగలిగితే ఎవరైనా దేవుడే అని తర్వాత చెప్పాడట పవన్. ఆ తర్వాతి రోజున షూటింగ్ చేయడం జరిగిందంటూ.. పవన్ దేవుడు ఇన్సిడెంట్ ని వివరించాడు శరత్ మరార్. ప్రస్తుతం కాటమరాయుడుతో తమ అనుబంధం కొనసాగుతుండడం ఆనందంగా ఉందని చెప్పాడు.