Begin typing your search above and press return to search.
పఠాన్ 100 అడుగుల కటౌట్.. బుర్జ్ ఖలీఫా ట్రైలర్ అన్నీ సౌత్ కి కాపీ!?
By: Tupaki Desk | 15 Jan 2023 9:30 AM GMTసంక్రాంతి పండగ తరవాత SRK హంగామా ప్రారంభమైంది. అతడు నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ పఠాన్ జనవరి చివరిలో అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక పఠాన్ ట్రైలర్ సూపర్ పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేయగా హంగామా ఒక రేంజులో ఉంది. హాలీవుడ్ సినిమాల రేంజులో భారీ యాక్షన్ అడ్వెంచర్లతో రక్తి కట్టించనున్న ఈ సినిమాని ఎంత త్వరగా థియేటర్లలో చూడాలా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. తాజాగా SRK యూనివర్స్ సహ-వ్యవస్థాపకుడు పఠాన్ మొదటి-రోజు మొదటి షో అభిమానుల ప్రదర్శనల తాలూకా వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో 100 అడుగుల ప్లస్ షారూఖ్ ఖాన్ కటౌట్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పఠాన్ విడుదలను పండుగలా జరుపుకోవాలనుకుంటున్నామని అన్నారు.
నేటి యుగంలో ప్రతి పెద్ద స్టార్ కి నటీమణులకు ప్రత్యేక అభిమాన సంఘాలు ఉన్నాయి. కానీ SRK యూనివర్స్ వీళ్లలో యూనిక్ గా నిలుస్తుంది. ఈ సంఘంలోని సభ్యులు షారుఖ్ ఖాన్ అతడి సినిమాలను ఎగ్జయిటెడ్ గా సెలబ్రేట్ చేసుకునే విధానం హృదయంతో అందంగా కనిపిస్తుంది అని ఆయన అన్నారు. పఠాన్ తో నాలుగు సంవత్సరాల తర్వాత SRK పెద్ద తెరపైకి రావడంతో అభిమానులలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. వారు పఠాన్ విడుదలను కోలాహలంగా జరుపుకోవడానికి చాలా గొప్ప ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ప్రస్తుతం బెంగళూరులో ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో అభిమానుల స్క్రీనింగ్ లకు టికెట్లు విక్రయిస్తున్నారు. షోలకు భారీ ఏర్పాట్లు చేసారు. బుక్ మై షోలో అభిమానుల ప్రదర్శనల కోసం లిస్టింగ్ చేసిన మొదటి హిందీ చిత్రం ఇదే. అసలు ముందస్తు షోలు ప్రారంభం కాకముందే అభిమానుల షోలు ప్రదర్శనలు పూర్తి అవుతాయి. ఈ ప్రదర్శనలు 200+ నగరాల్లో జరుగుతాయి. కనీసం 500 షోలు వేయాలని ప్లాన్ చేశాం. ముంబై - ఢిల్లీలో మొదటి రోజు మొదటి షో సహా ఆరు షోలను వేస్తున్నాం. కోల్ కతాలో 4 ప్రదర్శనలు ఉంటాయి. మా షోలు సాధారణ షో టైమింగ్స్ కంటే ముందే ప్రారంభమవుతాయి. ఉదయం 7:00 లేదా 8:00 గంటలకు షోలు వేస్తున్నాం. కాబట్టి ఉదయం 9:00 లేదా 10:00 గంటలలోపు షోల నుంచి భారీ మొత్తం వసూలవుతుందని తెలిపారు. పఠాన్ షోల కోసం అభిమానులలో అనూహ్యమైన డిమాండ్ ఉందని యష్ వెల్లడించారు. ఇప్పటికే చాలా షోల టికెట్లు అమ్ముడయ్యాయి. ముంబైలో మాకు ఉన్న అదనపు డిమాండ్ కారణంగా మరో 3 షోలు అదనంగా వేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఢిల్లీలో 6 షోలు వేస్తున్నామని తెలిపారు.
SRK యూనివర్స్ సభ్యులు పఠాన్ షోల ప్రదర్శనల కోసం మాత్రమే ఏర్పాటు చేయరు. విడుదలను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. జీరో (2018) సమయంలో కటౌట్ లను మించి ఈసారి భారీ కటౌట్ ను తయారు చేసాం. ఇది ముంబైలోని IMAX వడాలాలో పెట్టాం.. ఈసారి దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో 100 అడుగుల ప్లస్ షారుఖ్ ఖాన్ కటౌట్ లను ఏర్పాటు చేయబోతున్నాం. ఏ థియేటర్లలో ఈ కటౌట్ లు ఉంటాయో ఆలోచన స్పష్టంగా ఉంది. పఠాన్ విడుదలను పండుగలా జరుపుకోవాలని దక్షిణాదిన అభిమానులు తమ స్టార్ల కోసం చేసే హంగామా తరహాలో ఈసారి సందడి చేయాలని మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమాతో బాలీవుడ్ కు కూడా సౌత్ స్టైల్ ని తీసుకురావాలనుకుంటున్నాం.. అని తెలిపారు.
ఈ వేడుకలకు అభిమానులు సహకరించారని సంఘం అధ్యక్షుడు యష్ పర్యాణి కోరారు. పఠాన్ IMAX ఫార్మాట్ లో చిత్రీకరించిన IMAXలో విడుదల చేస్తున్న మొదటి భారతీయ చిత్రం కాబట్టి మేం IMAX థియేటర్ లలో ఘనంగా షోలను ప్లాన్ చేస్తున్నాం. ఇది అంతిమంగా అతి పెద్ద-స్క్రీన్ అనుభూతిని ప్రేక్షకులకు కలిగిస్తుంది... అని అన్నారు. ఇది కేవలం మొదటి రోజు మొదటి షోలకే పరిమితం కాదు. మేము జనవరి 25న #PathaanDayని జరుపుకుంటాం. జనవరి 26న #RepublicDayWithPathaan వేడుకలు జరుపుకుంటాం... అని తెలిపారు.
అలాగే దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో షారూఖ్ ఖాన్ పఠాన్ ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు! ఇటీవలి కాలంలో చాలా దక్షిణాది సినిమాల ట్రైలర్లను బుర్జ్ ఖలీఫా పై ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో పఠాన్ కూడా ఒకటిగా నిలవనుంది. ప్రతిష్టాత్మక గూఢచారి విశ్వంలో పఠాన్ ఒక భాగం. దేశంలోని అతిపెద్ద సూపర్ స్టార్ లు షారూఖ్ ఖాన్- దీపికా పదుకొనే- జాన్ అబ్రహాం ఈ చిత్రంలో నటించారు.
ఇంటర్నేషనల్ లీగ్ T20 కోసం మిడిల్ ఈస్ట్ లో ఉన్న షారుఖ్ ఖాన్,ఐకానిక్ బుర్జ్ ఖలీఫా భవంతిపై తన పఠాన్ ట్రైలర్ ను ప్రదర్శిస్తారని YRF సంస్థ కూడా అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్ T20 కోసం షారూఖ్ UAEలో ఉన్నారు.YRF `పఠాన్` ని జనవరి 25న హిందీ-తెలుగు- తమిళం లో విడుదల చేయనుంది.