Begin typing your search above and press return to search.
నాలుగేళ్ల ఎదురుచూపులకు తెర పడింది
By: Tupaki Desk | 2 March 2022 2:30 PM GMTబాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చివరగా 2018 సంవత్సరంలో జీరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా దారుణమైన పరాజయంను ఆయనకు కట్టబెట్టింది. స్వీయ నిర్మాణం లో షారుఖ్ ఆ సినిమా ను నిర్మించాడు. హీరోగా మరియు నిర్మాతగా రెండు విధాలుగా కూడా షారుఖ్ కు ఆ సినిమా తీవ్రంగా నష్టాన్ని మిగిల్చింది. ఆ నష్టం నుండి బయట పడటం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు.
షారుఖ్ ఖాన్ హీరోగా ఎట్టకేలకు సినిమా వచ్చేందుకు సిద్దం అయ్యింది. గత రెండేళ్లుగా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం అవ్వడంతో సినిమా ను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే జీరో సినిమా విడుదలకు పఠాన్ సినిమా విడుదల తేదీకి ఏకంగా అయిదు సంవత్సరాల గ్యాప్ అన్నమాట.
పఠాన్ సినిమా విడుదలకు దాదాపుగా సంవత్సరం సమయం ఉంది. అయినా కూడా అభిమానులు ఒకింత రిలాక్స్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే బాద్ షా పఠాన్ సినిమా నుండి ఫస్ట్ లుక్ వచ్చింది. నాలుగు సంవత్సరాలుగా నార్మల్ లుక్ లోనే అప్పుడప్పుడు చూస్తున్నాం కాని సినిమా లుక్ తో షారుఖ్ ను చూడక చాలా ఏళ్లు అయ్యింది. అందుకే ఆయన పోస్టర్ విడుదల తో పఠాన్ పై ఆసక్తి మరింతగా పెరిగింది.
షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ సినిమా ను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. సినిమా షూటింగ్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది వరకు వాయిదా వేయాలనే ఉద్దేశ్యంతో షారుఖ్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
వచ్చే ఏడాదిలో కేవలం పఠాన్ సినిమా మాత్రమే కాకుండా మరో సినిమా ను కూడా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరోలు ఈమద్య కాలంలో ఏడాదికి రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నారు. కాని అత్యంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షారుఖ్ మాత్రం ఒక సినిమా కు ఒక సినిమా కు ఏకంగా అయిదు సంవత్సరాల గ్యాప్ తీసుకోవడం కాస్త అభిమానులకు మనసు నొప్పించే విషయమే.
జీరో సినిమా విడుదల సమయంలో ఆయన చాలా డిప్రెషన్ కు గురి అయ్యారనే వార్తలు వచ్చాయి. అందుకే సినిమాలు చేయకుండా సైలెంట్ గా ఉండి పోయాడని బాలీవుడ్ మీడియా కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన నుండి సినిమా లు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ఆయన కొడుకు మరియు కూతురు కూడా హీరో మరియు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.