Begin typing your search above and press return to search.

వరస ఫ్లాప్ లో దిక్కుతోచని స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   12 Nov 2019 1:30 AM GMT
వరస ఫ్లాప్ లో దిక్కుతోచని స్టార్ హీరో!
X
షారూక్ ఖాన్ హిట్ కొట్టి చాలా కాలం గడిచిపోయింది. అంతకు మించిన విషయం ఏమిటంటే… ఆయన సినిమాలు ఒకదానితో మరోటి పోటీ పడ్డట్టుగా ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. వరస ఫ్లాపులతో షారూక్ ఖాన్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.

కింగ్ ఖాన్ అనే ఇమేజ్ కు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో షారూక్ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోతూ ఉండటం గమనార్హం. 'జీరో' రూపంలో ఒక ప్రయోగం కూడా చేశాడు షారూక్. అయితే అది కూడా ఇతడికి విజయాన్ని ఇవ్వలేదు!

ఇలాంటి నేఫథ్యంలో తన కెరీర్ పై తనే జాలి పడుతూ ఉన్నాడు షారూక్. మరి కొన్ని ఫ్లాపులు వస్తే బాలీవుడ్ లో తన స్థానం కొశ్చన్ మార్క్ అవుతుందనేది షారూక్ కు కూడా తెలిసిన అంశమే. అందులోనూ తనయుడిని లాంఛ్ చేసే ఆలోచన ఉంది ఈ హీరోకి. ఇలాంటి నేపథ్యంలో తదుపరి ఎవరికి ఓకే చెప్పాలనేది కూడా షారూక్ కు ఇబ్బందికరమైన అంశంగా మారిందట!

సౌత్ దర్శకులను సంప్రదిస్తూ ఉన్నారు, అయితే వారితో ప్రాజెక్టులు ఓకే చేయడం లేదు. వారిని నమ్ముకుని బరిలోకి దిగొచ్చా లేదా అనేది షారూక్ డిసైడ్ చేసుకోలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. అలా కాకుండా.. ఏదైనా బాలీవుడ్ సూపర్ హిట్ ప్రాంచైజ్ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనా షారూక్ ఉందట.

అందుకే 'ధూమ్ -4' లో చేయడానికి షారూక్ ఆసక్తితో ఉన్నాడట. అలా హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ చేస్తే అయినా .. తనకు వాటి ప్రభావంతో అయినా హిట్ దక్కకపోదా అన్నట్టుగా షారూక్ ఆలోచిస్తున్నట్టున్నాడని పరిశీలకులు అంటున్నారు.