Begin typing your search above and press return to search.
ఫొటో జర్నలిస్టును ఢీకొన్న షారుక్ కారు..
By: Tupaki Desk | 16 March 2017 7:55 AM GMTబాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాను ఎందుకు స్పెషలో మరోసారి నిరూపించుకున్నాడు. దేశమంతా హిట్ అండ్ రన్ కేసులు చాలా కామన్ అయిపోయిన తరుణంలో సూపర్ స్టార్ రేంజిలో ఉండి కూడా తన కారు ఓ జర్నలిస్టు కాలుపై నుంచి ప్రమాదవశాత్తు వెళ్లినా స్పందించి అతణ్ని ఆసుపత్రిలో చేర్పించి మొత్తం బాధ్యత చూసుకున్నాడు.
'డియర్ జిందగీ' సినిమాలో తనతో పాటు నటించిన అలియాభట్ జన్మదినం కావడంతో షారుక్ ఆమె ఇంటికి షారుఖ్ వెళ్లాడు. దీంతో, ఎప్పట్లాగానే షారుఖ్ ను తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ఈ సందర్భంలో, షారుఖ్ కారు వేగంగా వస్తున్నప్పటికీ...దాన్ని పట్టించుకోకుండా ఓ ఫొటోగ్రాఫర్ షారుఖ్ ను ఫొటో తీసే పనిలో పడ్డాడు. దీంతో, షారుఖ్ కారు సదరు ఫొటోగ్రాఫర్ కాలిపై నుంచి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన షారుఖ్ వెంటనే కారు నుంచి దిగి వచ్చాడు. వెంటనే తన బాడీగార్డును తోడు ఇచ్చి, ఫొటోగ్రాఫర్ ను నానావతి ఆసుపత్రికి తరలించాడు. వైద్యానికి అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని... అతనికి పూర్తిగా బాగు అయ్యేంత వరకు తానే చూసుకుంటానని షారుఖ్ ఈ సందర్భంగా తెలిపాడు.
షారుఖ్ గొప్ప మనసును చూసి అక్కడున్న వారంతా ఎంతో సంతోషించారు. కాగా గాయపడిన ఫొటో జర్నలిస్టు ఆ ప్రొఫెషన్ కు కొత్త వ్యక్తని.. షారుక్ ను తొలిసారి చూసిన సంతోషంలో ఉబ్బితబ్బిబ్బయి వీలైనంత దగ్గరగా చూడాలని.. ఫొటో తీయాలని ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యాడని చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/