Begin typing your search above and press return to search.
కొడుకు మాటతో పాట ఆపేసిన బాలీవుడ్ బాద్షా..
By: Tupaki Desk | 4 May 2020 5:30 PM GMTప్రమాదకరమైన కరోనాతో పోరాటం సాగించడానికి మేము కూడా ఉన్నామంటూ.. ఫేస్‌బుక్ వేదికగా "ఐ ఫర్ ఇండియా" వర్చువల్ కన్సర్ట్‌లో సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటీవలే జరిగిన ఈ కార్యక్రమానికి స్టార్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, దర్శకురాలు జోయా అక్తర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కన్సర్ట్ ద్వారా వచ్చే డబ్బును కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ కోసం విరాళంగా ఇస్తామని గివ్ ఇండియా సంస్థ పేర్కొంది. ఈ కార్యక్రమంలో హాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం చురుకుగా పాల్గొన్నారు. ఇందులో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా జాయిన్ అయ్యారు. అయితే షారుఖ్ లైవ్ కన్సర్ట్‌లో పాల్గొన్న టైంలో ఆయన కొడుకు అబ్‌రామ్ ఖాన్ అక్కడికి చేరాడు. ఇక షారుఖ్ ఆగుతారా.. కొడుకుతో కలిసి హ్యాపీగా చిందేసి ఎంజాయ్ చేశారు.
ఇక వీరి పాట లాక్‌డౌన్‌లో జరిగే పరిస్థితులను వివరిస్తూ సాగుతుంది. ఇక పాట పూర్తయిన వెంటనే కొడుకును గట్టిగా హత్తుకుని ప్రేమగా ముద్దాడాడు షారుఖ్. ఆ తర్వాత మరో పాట పాడతానని షారుఖ్ రెడీ అవుతున్న టైంలో కొడుకు అభ్ రామ్ "పప్పా, ఇక చాలు నీ పాట ఆపేయ్" అన్నాడు. అది విన్న షారుఖ్.. కొడుకు మాట విని సైలెంట్ అయిపోయారు. వారిద్దరికీ సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను షారుఖ్ ట్విటర్ లో షేర్ చేశాడు. ఈ వీడియోలో హీరో "అంతా బాగవుతుంది.." అని చెప్పిన విషయాలు నిజమే అవుతాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నిజానికైతే సైనీ రాజ్ రచించిన ఈ పాటను మనీ హేస్ట్ అద్భుతంగా ఆలపించాడు. దీనికి ర్యాపర్ బాద్‌షా సంగీతం రూపొందించాడు. "ఐ ఫర్ ఇండియా" లైవ్ కన్సర్ట్‌లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా 3.5 కోట్లకు పైగా విరాళాలను సేకరించారు. ఈ సేకరించిన మొత్తాన్ని కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ లో జమచేస్తామని చెప్పారు.