Begin typing your search above and press return to search.
ఆచార్య నెలలో రాబోతున్న శర్వా
By: Tupaki Desk | 5 Nov 2021 5:02 AM GMTయంగ్ హీరో శర్వానంద్ ఈమద్య కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించడంలో విఫలం అవుతున్నాయి. ఈమద్య కాలంలో వచ్చిన శ్రీకారం సినిమా టాక్ పాజిటివ్ గా వచ్చినా వసూళ్ల విషయంలో సంతృప్తి దక్కలేదు. ఇక దసరా కానుకగా వచ్చిన మహా సముద్రం తీవ్రంగా నిరాశ పర్చింది. కథల ఎంపిక విషయంలో శర్వానంద్ కు గతంలో మంచి పేరు ఉండేది. కాని ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ మహా సముద్రం చూసిన తర్వాత అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మహా సముద్రం సినిమా నిరాశ పర్చినా కూడా ఎక్కువ ఇబ్బందికి గురి కాకుండా వెంట వెంటనే రెండు సినిమాలను విడుదల చేసేందుకు గాను శర్వా ప్లాన్ చేసుకున్నాడు. అందులో ఒకటి ఆడవాళ్లు మీకు జోహార్లు కాగా మరోటి ఒకే ఒక జీవితం. ఈ రెండు సినిమాలపై శర్వాతో పాటు ఆయన అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు.
దీపావళి సందర్బంగా ఒకే ఒక జీవితం నుండి పోస్టర్ ను విడుదల చేశారు. సినిమాలో అమల నటిస్తున్నట్లుగా ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. కాని తాజా పోస్టర్ తో ఆమె ఈ సినిమాలో కీలక పాత్రల నటిస్తున్న విషయమై క్లారిటీ వచ్చింది. అమల అక్కినేని సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు ఈ సినిమా కోసం రావడం జరిగింది. మద్యలో ఒకటి రెండు సినిమాల్లో నటించినా కూడా అందులో ఆమె గెస్ట్ గానే కనిపించారు. మొదటి సారి ఈమె ఒక మంచి పాత్రలో ఆకట్టుకునేందుకు ఫుల్ లెంగ్త్ రోల్ ను చేసినట్లుగా తెలుస్తోంది. శర్వానంద్ మరియు అమల అక్కినేని మద్య ఉండే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి అన్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇక ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ లో పేర్కొన్నారు. సాదారణంగా అయితే ఫిబ్రవరి నెలను తెలుగు సినిమా స్కిప్ చేస్తుంది. ఎందుకంటే మార్చిలో వచ్చే పరీక్షల కోసం ఫిబ్రవరి నెల నుండే సన్నాహకాలు ఉంటాయి. కనుక ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు స్టూడెంట్స్ పెద్దగా సినిమాలకు రారు అనే ఉద్దేశ్యంతో ఫిబ్రవరి లో సినిమాలు ఉండేవి కావు. కాని కరోనా మొత్తం మార్చేసింది. ఫిబ్రవరితో పాటు మార్చిలో కూడా వరుసగా సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కరోనా వల్ల ఏడాదికి పైగా థియేటర్లు పూర్తిగా మూత పడి ఉన్నాయి. కనుక విడుదలకు చాలా సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. ఆ కారణంగానే ఫిబ్రవరిలో ఆచార్యను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు అదే ఆచార్య నెల అంటే ఫిబ్రవరి నెలలో శర్వానంద్ మూవీ కూడా రాబోతుంది.