Begin typing your search above and press return to search.
ప్రామిస్ ను నిలబెట్టుకున్న శర్వా..!
By: Tupaki Desk | 10 Sep 2022 8:40 AM GMTయువ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ "ఒకే ఒక జీవితం" థియేటర్లలోకి వచ్చేసింది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ రాబడుతోంది. దీంతో చాలా గ్యాప్ తర్వాత ఎట్టకేలకు శర్వా కు మంచి హిట్టు పడిందని అభిమానులు ఖుషీ అవుతున్నారు.
తన కెరీర్ లో 30వ చిత్రంగా వచ్చిన 'ఒకే ఒక జీవితం' పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు. ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ.."ఒక మంచి సినిమా చూపిస్తానని ఆడియన్స్ కు ప్రామిస్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఏమాత్రం డిజప్పాయింట్ చెయ్యను. ఇది మా అందరి నమ్మకం. ఎంతో నమ్మి చేశాం. ఒక మంచి సినిమా చేశామని గర్వంగా చెప్తున్నా. మీరు ఈ సినిమా చూసి నిరాశపడరు. సెప్టెంబర్ 9న థియేటర్లలో ఈ సినిమా చూడండి" అని అన్నారు.
శర్వా వాగ్దానం చేసినట్లుగానే 'ఒకే ఒక జీవితం' వంటి మంచి సినిమాతో వచ్చాడని ప్రేక్షకుల స్పందన చూస్తుంటే అర్థం అవుతుంది. అద్భుతమైన ప్రదర్శనలు మరియు ఎమోషనల్ రైడ్ తో కూడిన ఒక బ్యూటిఫుల్ చిత్రాన్ని అందించడం ద్వారా వాగ్దానం చేసి దానిని నిలబెట్టుకున్నాడని చెప్పాలి. అందుకే శర్వానంద్ మాట్లాడిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.
ఇకపోతే 'ఒకే ఒక జీవితం' శర్వా కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోతుంది. ఇందులో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. యునిక్ స్టోరీ - హానెస్ట్ మేకింగ్ - చక్కని కథనం మరియు సాంకేతిక ప్రమాణాలు ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేశాయని చెప్పాలి. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడానికి చిత్ర బృందం ఈరోజు శనివారం థాంక్స్ మీట్ నిర్వహించింది.
టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'ఒకే ఒక జీవితం' సినిమా రూపొందింది. కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించాడు. గతంలో 'జర్నీ' సినిమాతో తమిళ ఆడియన్స్ ను ఆకట్టుకున్న శర్వా.. ఇప్పుడు 'కణం' తో మరోసారి మెప్పించాడు.
ఇందులో శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల నటించగా.. రీతూ వర్మ - వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - నాజర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు మరియు ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు.
తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి డైలాగ్స్ అందించగా.. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ వర్క్ చేయగా.. ఎన్ సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.