Begin typing your search above and press return to search.

శర్వా30 ఫస్ట్ లుక్: 'ఒకే ఒక జీవితం' టైటిల్ ఖరారు..!

By:  Tupaki Desk   |   28 Jun 2021 6:00 PM IST
శర్వా30 ఫస్ట్ లుక్: ఒకే ఒక జీవితం టైటిల్ ఖరారు..!
X
టాలీవుడ్ యువహీరో శర్వానంద్ కొంతకాలంగా హిట్ విషయంలో సతమతం అవుతున్నాడు. ఎందుకంటే కొన్నేళ్లుగా స్టోరీలను నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. కానీ ఎక్కడో చిన్న లోపంతో సినిమాలు బోల్తాకొడుతూ వచ్చాయి. రీసెంట్ గా శ్రీకారం సినిమా చేసాడు. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం తదుపరి సినిమాలను చకచకా ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. ఇటీవలే కోవిడ్ లాక్డౌన్ ముగిసి షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే శర్వానంద్ ప్రస్తుతం ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతితో మహాసముద్రం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు శర్వా 30వ సినిమా కూడా ఫినిష్ చేస్తున్నాడు.

కోవిడ్ ముందు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే పూర్తి అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో కొత్త దర్శకులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. శ్రీకారం తర్వాత శ్రీ కార్తీక్ అనే నూతన దర్శకుడితో శర్వా తన 30వ సినిమా ప్రకటించాడు. అదికూడా బైలింగ్వేల్ సినిమా కావడం విశేషం. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు 'ఒకే ఒక జీవితం' అనే టైటిల్ ఖరారు చేశారు. పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమాలో హీరో మ్యూజిక్ ఇంటరెస్ట్ కలిగిన యువకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే శర్వా పోస్టర్ లో గిటార్ తో ఉన్నాడు. అయితే సినిమాలో తల్లి కొడుకు మధ్య ఎమోషనల్ స్టోరీ ఉంటుందని సమాచారం.

అలాగే పోస్టర్ బట్టి చూస్తే సినిమాలో హీరో మ్యూజిక్ పరంగా ఫేమ్ అవ్వడానికి పల్లెటూరు నుండి పట్టణానికి పయనం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. పల్లె జీవితం నుండి నేటి టెక్నాలజీ లైఫ్ వరకు ఈ సినిమాలో చర్చించనున్నట్లు అర్ధమవుతుంది. మొత్తానికి 'ఒకే ఒక జీవితం' అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో శర్వా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో అక్కినేని అమల కీలకపాత్ర పోషిస్తోంది. తెలుగమ్మాయి రితూవర్మ హీరోయిన్. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు.. ఎస్ఆర్ శేఖర్ నిర్మిస్తున్నారు. ఎలాగో శర్వాకు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ దృష్టిలోనే సినిమాను బైలింగ్వెల్ ప్లాన్ చేసినట్లు టాక్. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా చేయనున్నాడు.