Begin typing your search above and press return to search.

శర్వాకు బియర్డ్ లుక్ భలేగా సూటయిందే

By:  Tupaki Desk   |   20 Feb 2019 7:48 AM GMT
శర్వాకు బియర్డ్ లుక్ భలేగా సూటయిందే
X
శర్వానంద్ - సుధీర్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జోరుగా సాగుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాలో శర్వాకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. శర్వానంద్ - కాజల్ అగర్వాల్ జోడీగా నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఈ సినిమాలో శర్వా రెండు డిఫరెంట్ షేడ్స్ లో కన్పిస్తాడు. యువకుడిగానూ.. పెద్ద వయస్కుడిగానూ శర్వాకు ఈ సినిమాలో రెండు విభిన్న గెటప్స్ ఉంటాయి ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతున్న షూటింగ్ లో పెద్ద వయస్కుడి గెటప్ లో గడ్డంపెంచి కనిపిస్తున్నాడు. పైనున్న ఫోటోలో ఒక క్రీమ్ కలర్లో ఉన్న ఒక లాంగ్ కోటు.. కళ్ళకు గ్లాసెస్ పెట్టుకొని యమా స్టైలిష్ గా కూర్చుని ఉన్నాడు. బియర్డ్ లుక్ శర్వాకు భలేగా సూటయింది. ఇదే ఫోటోలో కాజల్ అగర్వాల్ కూడా మోడరన్ డ్రస్ లో ఉంది. మరి స్పెయిన్ లో ఈ జంట ఏం చేస్తున్నారో ఏమో గానీ ఇద్దరూ సీరియస్ గా దర్శకుడు సుధీర్ వర్మ చెప్పేది వింటున్నారు.

శర్వా డిఫరెంట్ గెటప్.. రెండు షేడ్స్ ఉన్న పాత్ర.. ఇవన్నీ చూస్తుంటే దర్శకుడు ఏదో స్ట్రాంగ్ పాయింట్ తోనే సినిమాను తెరకెక్కిస్తునట్టుగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సమ్మర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.