Begin typing your search above and press return to search.
శర్వా-నిత్య సినిమాకు మోక్షం
By: Tupaki Desk | 3 March 2016 5:30 PM GMTరెండు మూడేళ్లు వెనక్కి వెళ్తే.. శర్వానంద్, నిత్యామీనన్ కాంబినేషన్లో తమిళ క్లాస్ డైరెక్టర్ చేరన్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. తమిళంలో ‘జేకేయనుం నన్బన్ వాల్కై’ అని.. తెలుగులో ‘ఏమిటో ఈ మాయ’ అని ఈ సినిమాకు పేరు పెట్టారు. షూటింగ్ అయిపోయింది. విడుదలకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ అనివార్య కారణాలతో సినిమా పక్కనబడిపోయింది. ఐతే తమిళంలో మాత్రం ఈ చిత్రం విడుదలైంది. ఐతే దాన్ని విడుదల చేసిన తీరు పెద్ద సెన్సేషన్.
థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయకుండా నేరుగా డీవీడీల రూపంలో ‘జేకేయనుం..’ను విడుదల చేసి ఒక కొత్త ప్రయోగానికి తెర తీశాడు చేరన్. ఈ విధానానికి సీ2హెచ్ (సినిమా టు హోమ్) అని పేరు కూడా పెట్టాడు. జనాల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. డీవీడీలు బాగానే కొన్నారు. సినిమా కూడా బాగానే ఆకట్టుకుంది. ఇది జరిగి కూడా ఏడాది దాటిపోయింది. ఐతే తెలుగు వెర్షన్ సంగతి పట్టించుకోకపోవడంతో ఇక దాన్ని పూర్తిగా పక్కనబెట్టేసినట్లే అనుకున్నారంతా. కానీ ఇప్పుడా సినిమాను బయటికి తీస్తున్నారు.
ఐతే తమిళంలో లాగా డీవీడీల్లో కాకుండా డైరెక్టుగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు పెట్టిన ‘ఏమిటో ఈ మాయ’ కాకుండా ఈ సినిమాకు కొత్త పేరు పెట్టారు.. ‘రాజాధి రాజా’ అని. ఈ నెల మూడో వారంలో సినిమాను రిలీజ్ చేస్తారట. బహుశా 18న ‘రాజాధిరాజా’ ప్రేక్షకుల ముందుకు రావొచ్చేమో. మంచి ఫీల్ గుడ్ మూవీ అయిన ‘రాజాధిరాజా’ తెలుగు ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.