Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : క్యూట్‌ గా ఉన్న హీరోలను గుర్తు పట్టారా?

By:  Tupaki Desk   |   16 April 2022 8:00 AM IST
పిక్ టాక్ : క్యూట్‌ గా ఉన్న హీరోలను గుర్తు పట్టారా?
X
హీరోలుగా ప్రస్తుతం వారిద్దరు ఓ రేంజ్ లో ఉన్నారు. ఒకరు పాన్ ఇండియా స్టార్‌ గా వెలుగు వెలుగుతుంటే మరొకరు తెలుగు మరియు తమిళంలో కలిపి మంచి సినిమాలను చేస్తూ హీరోగా తనదైన ముద్రను ఇండస్ట్రీ లో వేస్తున్నారు. ఇదే సమయంలో వారిద్దరు వారి వారి వ్యక్తిగత జీవితంలో చాలా సక్సెస్ ఫుల్ గా కూడా దూసుకు పోతున్నారు. వీరిద్దరిని ఇప్పటికే గుర్తు పట్టి ఉంటారు.

ఔను మీరు ఊహించింది.. గెస్‌ చేసింది నిజమే... వీరిద్దరు చాలా మంచి స్నేహితులు అయిన రామ్‌ చరణ్‌ మరియు శర్వానంద్‌. వీరిద్దరి మద్య ఇండస్ట్రీకి రాక ముందు నుండే స్నేహం ఉంది. చరణ్ తో ఉన్న స్నేహం కారణంగానే శర్వానంద్‌ కు ఆఫర్లు వచ్చాయి అనేది ఒక వర్గం వారు చెప్పే మాట. చిన్న వయసు లోనే ఒక యాడ్‌ లో చిరంజీవితో శర్వానంద్ నటించాడు.

చరణ్ స్నేహితుడు అవ్వడం వల్లే శర్వానంద్ కు ఆ ఆఫర్ వచ్చింది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఆ విషయాన్ని పక్కన పెడితే హీరోలుగా ప్రస్తుతం వీరిద్దరు కూడా బిజీ బిజీగా ఉన్నారు. రామ్‌ చరణ్‌ తాజాగా ఆర్ ఆర్ ఆర్‌ సినిమా తో పాన్ ఇండియా స్టార్‌ గా నిలిస్తే.. శర్వానంద్‌ విలక్షణమైన పాత్రలు ఎంపిక చేసుకుంటూ హీరోగా దూసుకు పోతున్నాడు.

వీరిద్దరు కనీసం మీసాలు కూడా రాకుండా.. చాలా క్యూట్ గా ఉన్న సమయంలోనే ఈ ఫోటోను తీసుకున్నారు. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆకట్టుకునే విధంగా క్యూట్ కుర్రాళ్లుగా వీరిద్దరు కనిస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాను కుదిపేస్తుంది. క్యూట్‌ హీరోలుగా మంచి పేరు దక్కించుకున్న వీరిద్దరు ఇప్పటికి కూడా మంచి స్నేహితులుగానే కొనసాగుతూ ఉన్నారు.

రామ్‌ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా ను చేస్తున్నాడు. ద్వి పాత్రాభినయం చేస్తున్న రామ్‌ చరణ్‌ ఈ సినిమా తో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆర్ ఆర్‌ ఆర్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఇక శర్వానంద్‌ ఇటీవలే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం తన తదుపరి సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.