Begin typing your search above and press return to search.
క్లాసిక్ రీమేక్ కు క్లాప్ కొట్టారోచ్..!
By: Tupaki Desk | 6 April 2019 1:02 PM GMTలాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన తమిళ సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం '96'. కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా క్లాసిక్ ఫిలింగా ఆడియన్స్ తో.. క్రిటిక్స్ తో ప్రశంసలు అందుకుంది ఆ చిత్రం '96'. ఈ సినిమాలో విజయ్ సేతుపతి - త్రిష హీరో హీరోయిన్లుగా నటించి అందరినీ మెప్పించారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. రీమేక్ లో విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్.. త్రిష పాత్రలో సమంతా నటిస్తున్నారు.
ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ సినిమా ముహూర్తం షాట్ కు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్ హాజరయ్యాడు కానీ హీరోయిన్ సమంతా హాజరు కాలేదు. హరీష్ శంకర్.. ఇంద్రగంటి మోహన కృష్ణ కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా హజరయ్యారు. ఈ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం జే. మహేంద్రన్. ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్. '96' సినిమా సంగీత దర్శకుడు గోవింద వసంతనే తెలుగు వెర్షన్ కు సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. తమిళ ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన C.ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కూ దర్శకత్వం వహిస్తాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా రాజుగారి బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 34.