Begin typing your search above and press return to search.
నిజాయితీగా నిలుస్తున్న యూత్ హీరోలు
By: Tupaki Desk | 26 Dec 2018 6:02 AM GMTజయాపజయాలకు సంబంధం లేకుండా సినిమా విడుదల కావడం ఆలస్యం తమది సూపరంటే సూపరంటూ భజన చేసుకునే హీరోలు దర్శకులు నిర్మాతలను నిత్యం చూస్తూనే ఉంటాం. వద్దు మహాప్రభో అని ప్రేక్షకులు తిప్పికొట్టిన వాటికి సక్సెస్ టూర్లు చేసుకుని నవ్వుల పాలైన వాళ్ళు లేకపోలేదు. కాని ఇది నమ్మేంత అమాయకత్వం ఇప్పటి పబ్లిక్ లో లేదు. ఏ మాత్రం తేడా ఉన్నా మొదటి ఆటకే మైకుల సాక్షిగా సినిమా జాతకాలు స్వయానా చూసినవాళ్ల నోళ్ళ నుంచే బయటపడుతున్నాయి. అందుకే పబ్లిసిటీ కోసం అతిశయోక్తికి పోయినా నవ్వుపాలయ్యేది మేకర్సే.
ఈ సత్యాన్ని యువ హీరోలు గుర్తిస్తున్నారు. లేనిపోని కబుర్లు చెప్పి మోసం చేయడం కంటే నిజాన్ని ఒప్పేసుకుని తర్వాత సినిమా పై నమ్మకాన్ని పెంచుకోవడం బెటరని భావిస్తున్నారు. నోటా తర్వాత వారం లోపే దీని ఫలితాన్ని ఫేస్ బుక్ లో పబ్లిక్ గా ఒప్పేసుకున్నాడు విజయ్ దేవరకొండ. త్వరలోనే బౌన్స్ బ్యాక్ అవుతానని నమ్మండని ఫ్యాన్స్ కు మాటిచ్చాడు. చెప్పినట్టే టాక్సీవాలా హిట్ దక్కింది. ఇప్పుడు శర్వానంద్ - వరుణ్ తేజ్ లు కూడా ఈ విషయంలో భేషజాలకు పోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నారు.
అంతరిక్షం కింది సెంటర్స్ లో ఆడదని ముందే ఊహించానని అయితే మరో పది కోట్లు బడ్జెట్ ఎక్కువ పెట్టింటే ఇంకోలా ఫలితం దక్కేదని వరుణ్ తేజ్ కుండ బద్దలు కొట్టేసాడు. మరో వైపు శర్వానంద్ తన పడి పడి లేచే మనసు గురించి చెబుతూ గొప్ప సినిమా అనుకున్నది ఫలితం ఇవ్వలేదని క్రిటిక్స్ తో సహా అందరిని గౌరవిస్తూ వచ్చే సినిమా మీద ఎక్కువ శ్రద్ధ పెడతానని సక్సెస్ మీట్ లోనే చెప్పాడు. ఏదేమైనా ఈ ధోరణి చాలా మంచిది. మరో సినిమా పై వీళ్ళకే కాదు ప్రేక్షకులకు సైతం నమ్మకాన్ని కలిగిస్తుంది.