Begin typing your search above and press return to search.
శర్వా.. నాగార్జునను మించిపోయాడే
By: Tupaki Desk | 11 Jan 2016 4:26 AM GMTనాగార్జునకు కొంచెం వయసైపోయి ఉండొచ్చు కానీ.. ఇప్పటికీ ఆయన స్టారే, మంచి మార్కెట్ ఉన్న హీరోనే. ఇక శర్వానంద్ ‘రన్ రాజా రన్’ తర్వాత జోరుమీద ఉండొచ్చు కానీ.. అతడికి స్టార్ ఇమేజ్ ఏమీ లేదు. అయినప్పటికీ సంక్రాంతికి నాగార్జునతో పోటీ పడుతున్న శర్వానంద్.. తన ఆధిపత్యం చూపిస్తున్నాడు. సంక్రాంతికి విడుదలయ్యే మిగతా రెండు సినిమాలు నాన్నకు ప్రేమతో, డిక్టేటర్.. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్లను ఆక్రమించేస్తుంటే.. మిగిలిన థియేటర్లలో నాగ్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఎన్ని దక్కించుకుందో.. దానికి సమానంగా శర్వా సినిమా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ దక్కించుకోవడం విశేషం. రెండు సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా అటు ఇటుగా 500-600 థియేటర్లలోనే రిలీజవుతుండటం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో నాగ్, శర్వాల సినిమాలు ఒకే స్థాయిలో రిలీజవుతుండటమే ఆశ్చర్యమంటే.. యుఎస్ లో మరీ నాగ్ మూవీ కంటే కూడా శర్వా సినిమానే ఎక్కువ థియేటర్లలో విడుదలవుతుండటం విశేషం. ‘సోగ్గాడే చిన్నినాయనా’ను యుఎస్ లో 84 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తుంటే.. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ 90కి పైగా స్క్రీన్లను దక్కించుకుంది. యువి క్రియేషన్స్ నుంచి దీనికి ముందు వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్టు కావడం.. అంతకుముందు ఈ బేనర్లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాగానే ఆడటంతో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ మీద కూడా అక్కడి ఎగ్జిబిటర్లు ఎక్కువ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు సహా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేస్తుండటం వల్ల ఇంత పోటీలోనూ మంచి సంఖ్యలోనే థియేటర్లు దక్కాయి.