Begin typing your search above and press return to search.

శర్వా క్లారిటీతో ఉన్నాడట

By:  Tupaki Desk   |   26 Aug 2019 8:00 PM IST
శర్వా క్లారిటీతో ఉన్నాడట
X
రెగ్యులర్ కథలను ఎంచుకోకుండా విలక్షణత పాటించే హీరో శర్వానంద్ గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఏడాది కాలంలో రెండు డిజాస్టర్లు అందుకోవడం ఊహించని పరిమాణం. సాయి పల్లవి కాంబినేషన్ లో మంచి క్లాసిక్ లవ్ స్టోరీగా మిగిలిపోతుందని చేసిన పడి పడి లేచే మనసు పేపర్ పై కనిపించినంత అందంగా దర్శకుడు హను రాఘవపూడి తెరపై తీయలేకపోవడంతో పరాజయం తప్పలేదు. ఇక కేవలం లైన్ మాత్రమే విని ఓకే చెప్పిన రణరంగం విషయంలోనూ సుధీర్ వర్మ అదే తప్పు చేయడంతో రిజల్ట్ మారలేదు.

దీంతో దెబ్బకు శర్వానంద్ ఇకపై తనను ఎవరు కలుస్తానన్నా ఫుల్ స్క్రిప్ట్ ఉంటేనే కాంటాక్ట్ చేయమని చెబుతున్నాడట. సింగల్ లైన్ ఆర్డర్ ఉంటే నిర్మొహమాటంగా నో చెబుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అంతా నచ్చితే ఖచ్చితంగా చేస్తాననే మాట చెబుతున్నాడట. ప్రస్తుతం శర్వా రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి తమిళ్ లో ఆల్రెడీ ప్రూవ్ అయిన 96 రీమేక్ కాగా రెండోది ఏదో సెన్సేషనల్ సబ్జెక్ట్ గా చెప్పబడుతున్న శ్రీకారం. ఈ రెండు కూడా తక్కువ గ్యాప్ లోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

వీటి తర్వాత శర్వానంద్ ఇంకే కొత్త ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. దర్శకులు అప్రోచ్ అవుతున్నప్పటికీ స్క్రిప్ట్ విషయంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని డిసైడ్ కావడంతో ప్రకటన రావడం కొంత ఆలస్యం కావొచ్చు. కాకపోతే అభిమానులు నిరాశ పడకుండా కంటిన్యూగా సినిమాలు లైన్ పెట్టడం శర్వాకు ప్లస్ అవుతోంది. ఇప్పుడీ 96 శ్రీకారంల మీద బోలెడు హోప్స్ తో ఉన్న శర్వా అవి కనక నెరవేరితే పడి పడి లేచే మనసు రణరంగం చేసిన డ్యామేజ్ నుంచి ఈజీగా రికవర్ కావొచ్చు.