Begin typing your search above and press return to search.
`గారు` అనడం ఎబ్బెట్టే!
By: Tupaki Desk | 20 Dec 2018 5:32 AM GMTప్రస్తుతం టాలీవుడ్ యావత్తూ ఓ ఆసక్తికర డిబేట్ వేడెక్కిస్తోంది. సంఘంలో ఒక స్టేచర్ ఉన్న వాళ్లను పిలిచేప్పుడు `గారు` అని సంబోధించాలని బన్ని క్లాస్ తీస్కున్న సంగతి తెలిసిందే. శర్వానంద్ `పడి పడి లేచే మనసు` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చకెక్కిన సన్నివేశమిది. చిరంజీవి గారు.. పవన్ కల్యాణ్ గారు.. చంద్రబాబు గారు.. వైయస్ జగన్ గారు.. అని పిలవాలని... రాజకీయాల్లో ఉనంత మాత్రాన `రేయ్` అనే కుసంస్కారమైన పిలుపు తగదని బన్ని క్లాస్ తీస్కున్నాడు. శర్వా ఎంతో శ్రమించి.. అభిమానుల్ని సంపాదించుకుని ఈ స్థాయికి ఎదిగాడు. అందుకే తాను ఎంత క్లోజ్ అయినా వేదికల పై మాట్లాడేప్పుడు `గారు` అనే పిలుస్తాను అన్నాడు బన్ని. `శర్వానంద్ గారు` అని నొక్కి పలికాడు.
అయితే బన్ని అంత పెద్ద హీరో శర్వా `గారు` అని పిలిచారు కదా.. ఆ పిలుపు మీకేమనిపించింది? అని శర్వానంద్ ని ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం వచ్చింది. బన్ని అంత పెద్ద స్టార్ అలా పిలవడం కొంత ఎబ్బెట్టు (ఆడ్) గానే ఉంది. అయితే అంత పెద్ద స్టార్ అయ్యి ఉండీ పిలవగానే నా ఫంక్షన్ కి వచ్చారు. బన్ని- నేను మంచి స్నేహితులం. చిన్నప్పటి నుంచి కలిసి సినిమాలకు వెళ్లాం. ఫ్యామిలీ ఫంక్షన్ల లో కలుస్తుంటాం. తను శర్వా గారు అని పిలవగానే కొంత ఎబ్బెట్టు అనిపించింది. కానీ అతడు చాలా స్వీట్ పర్సన్... నైస్ గయ్.. మా టీమ్ తరపున తనకు ధన్యవాదాలు అన్నాడు.
సాయి పల్లవి ఏ సినిమా లో నటించినా హీరోల్ని డామినేట్ చేసేస్తుంది కదా? అని ప్రశ్నిస్తే.. ``నేను సాయిపల్లవి ని డామినేట్ చేసినా, సాయిపల్లవి నన్ను డామినేట్ చేసినా ప్రేమకథ లో బ్యూటీ కనిపించదు. ఒకరినొకరు సహకరించుకుంటూ వెళితేనే కెమిస్ట్రీ పండుతుంది. తను ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. గిఫ్టెడ్ అనుకోవాలేమో. తనతో చేసేటప్పుడు ఎంతో సౌకర్యంగా ఫీలయ్యాను. మా మధ్య కెమిస్ట్రీయే సినిమాకు హైలైట్`` అన్నారు. సూర్య- డా.వైశాలి పాత్రల మధ్య రొమాన్స్ బాగా పండిందని తెలిపారు. అలాగే సాయి పల్లవి గురించి రకరకాలుగా కామెంట్లు వినిపిస్తుంటాయి కదా.. మీరు ఎందుకు తనని వెనకేసుకొస్తున్నారు? అని ప్రశ్నిస్తే.. తన గురించి మా టీమ్‌లో ఎవరినైనా అడగండి.. తను చాలా స్వీట్ పర్సన్ అని చెబుతారు.. అంటూ శర్వా క్లారిటీనిచ్చారు.