Begin typing your search above and press return to search.

అలా జరక్కపోతే ఈ సినిమా చేసేవాడినే కాదు

By:  Tupaki Desk   |   30 Dec 2021 7:30 AM GMT
అలా జరక్కపోతే ఈ సినిమా చేసేవాడినే కాదు
X
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీకార్తీక్ దర్శకత్వంలో 'ఒకే ఒక జీవితం' సినిమా రూపొందింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమల అక్కినేని కీలకమైన పాత్రను పోషించారు. ముఖ్యమైన పాత్రల్లో వెన్నెల కిషోర్ .. ప్రియదర్శి కనిపించనున్నారు. నిన్న రాత్రి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై శర్వానంద్ మాట్లాడాడు.

"ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరూ. ఉన్నది 'ఒకే ఒక జీవితం' .. అందరూ లైఫ్ ను ఎంజాయ్ చేయండి. చాలా ఈవెంట్స్ ఉన్నాయి .. ఇప్పుడే మొత్తం మాట్లాడేస్తే ఎలా? ఒక్కటి మాత్రం చెప్పగలను .. ఇది నా సినిమానో ,.. శ్రీకార్తీక్ సినిమానో అనేది పక్కన పెడితే .. ఇది వాళ్ల అమ్మ సినిమా. ఈ కథ విన్న దగ్గర నుంచి గమనిస్తున్నాను. ప్రతి అడుగులో ఆమె మా వెనకాల ఉండి నడిపిస్తోంది. ఇంతకు ముందు సినిమాల గురించి చాలా ఎక్కువగా మాట్లాడాను. అందువలన ఈ సినిమా గురించి తక్కువగా మాట్లాడటమే మంచిదేమో.

ప్రభుగారు .. నేను ఎనిమిదేళ్లుగా ఎన్నో కథలను అనుకున్నాము .. చివరికి ఆయన ఈ స్క్రిప్ట్ పంపించారు. కథ వినగానే ఈ సినిమా చేయవలసిందే అనుకున్నాను. ఇలాంటి ఒక వండర్ఫుల్ ఫిల్మ్ లో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. 'ఒకే ఒక్క జీవితం' నా సినిమా అని లైఫ్ లాంగ్ గర్వంగా చెప్పుకోగలిగే సినిమా ఇది. శ్రీ కార్తీక్ ను తరువాత పోగొడుతాను. తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి చాలా మంచి డైలాగ్స్ రాశాడు. జేక్స్ బిజోయ్ అన్ని సాంగ్స్ ఇరగొట్టేశాడు. ముఖ్యంగా అమ్మ సాంగ్ ను అద్భుతంగా చేశాడు.

ఈ సాంగ్ గురించి చెప్పాలంటే .. ముందుగా ఆయన ఒక ట్యూన్ పంపించారు. ఇక్కడ మంచి రైటర్ ఎవరని ఆయన అడిగితే, ఒకరే ఒకరు ఉన్నారు .. ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అని చెప్పాను. ఆయన దాదాపు 9 నెలలు కష్టపడి ఒక పాట రాశారు. నాకు తెలిసి ఆయన అంత సమయం తీసుకున్న పాట ఏదీ లేదనుకుంటాను. శ్రీకార్తీక్ .. ఆయన డిస్కస్ చేసుకుంటూ పాట పూర్తయ్యే సరికి 9 నెలలు పట్టింది. ఈ కథకి ఆత్మనే అమ్మ. ఫస్టు కథ చెప్పగానే అమలగారు సినిమా చేస్తున్నారా అని అడిగాను .. ఆమె చేస్తే చేస్తాను .. లేదంటే చేయను అని చెప్పేశాను.

కథ చెబుతున్నప్పుడే ఆయన అమ్మ పాత్రలో అమలగారి పేరును ప్రస్తావిస్తూ వెళ్లాడు. దాంతో ఆ పాత్రలో నేను వేరొకరిని ఊహించుకోలేకపోయాను. అమ్మను చూస్తే ఎలా అనిపిస్తుందో .. ఆమె సెట్లోకి రాగానే యూనిట్ లో అందరం కూడా అలా అయిపోతాము. మిగతా విషయాలన్నీ కూడా తరువాత ఈవెంట్లో మాట్లాడుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మరిచిపోలేని సినిమా అవుతుంది .. థ్యాంక్యూ వెరీ మచ్" అంటూ ముగించాడు.