Begin typing your search above and press return to search.

సామ్‌ చాలా డేంజరస్‌ హీరోయిన్‌ : శర్వా

By:  Tupaki Desk   |   2 Feb 2020 11:49 AM IST
సామ్‌ చాలా డేంజరస్‌ హీరోయిన్‌ : శర్వా
X
తమిళ హిట్‌ మూవీ '96' రీమేక్‌ జాను విడుదలకు సిద్దం అయ్యింది. విజయ్‌ సేతుపతి పాత్రను శర్వానంద్‌ పోషించగా.. త్రిష పాత్రను సమంత పోషించిన విషయం తెల్సిందే. దిల్‌ రాజు బ్యానర్‌ లో రీమేక్‌ అయిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక తాజాగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా నాని హాజరయ్యాడు. సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అయ్యేలా ఉంటుందంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పారు. ఇక ఈ వేడుకలో శర్వానంద్‌ మాటాలు అందరిని నవ్వించాయి.

శర్వానంద్‌ మైక్‌ అందుకున్న వెంటనే అంతా కూడా సమంత గురించి మాట్లాడమంటూ అరిచారు. సమంత గురించి మాట్లాడమంటారా ఈమె చాలా డేంజరస్‌ అండి. మామూలుగా హీరోలకు కొందరు హీరోయిన్స్‌ తో నటించడం అంటే కష్టంగా ఉంటుంది. నిత్యామీనన్‌.. సాయి పల్లవి.. సమంత లాంటి వారితో నటించడం అంటే హీరోలకు చాలా కష్టం. వారిని క్రాస్‌ చేయడం కష్టమే కాని.. కనీసం వారితో బ్యాలన్స్‌ చేయడానికి అయినా ప్రయత్నించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.

ఈ సినిమాలో సమంతతో బ్యాలన్స్‌ చేసేందుకు చాలా కష్టపడ్డాను. సినిమాలో నా పాత్ర బాగుండి.. నేను బాగా చేశాను అంటే అది ఖచ్చితంగా సమంతకు క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. ఆమె వల్లే నా పాత్ర బాగా వస్తుందని శర్వా చెప్పుకొచ్చాడు. సమంత ఇప్పటికి కూడా తాను చేస్తున్నది మొదటి సినిమా అన్నట్లుగానే ఫీల్‌ అయ్యి చేస్తుంది. అది నేను ఆమె నుండి నేర్చుకున్నాను.

ఇక ఈ సినిమాలోని ప్రతి సీన్‌ కూడా ఏదో ఒక చోట అందరికి కనెక్ట్‌ అవుతుంది. ఈ సినిమాలోని పాత్రలు మన చుట్టు ఏదో ఒక సందర్బంలో తలిగినట్లుగానే ఉంటాయన్నారు. స్కూల్‌ డేస్‌ లవ్‌ 99 శాతం విఫలం అవుతుంది. స్కూల్‌ డేస్‌ ను గుర్తుకు తెచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని శర్వానంద్‌ చెప్పుకొచ్చాడు.