Begin typing your search above and press return to search.
ఫ్లాపులొచ్చినా అన్ స్టాపబుల్ ఈ యంగ్ హీరో
By: Tupaki Desk | 25 Nov 2020 2:30 AM GMTజయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే హీరోలు అరుదుగానే ఉంటారు. ఆ కోవకే చెందుతాడు వెర్సటైల్ హీరో శర్వానంద్. శతమానం భవతి తర్వాత కెరీర్ లో మళ్లీ అంతటి బ్లాక్ బస్టర్ లేదు. వరుస ఫ్లాపులొచ్చాయి. అయినా అతడికి ఆఫర్ల పరంగా కొదవేమీ లేదు. ఇప్పటికిప్పుడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు.
ఆర్.ఎక్స్ 100 దర్శకుడితో `మహా సముద్రం`.. కిశోర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకారం చిత్రాల్లో నటిస్తున్నాడు. శ్రీకారం షూటింగ్ చివరి దశలో ఉంది. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న చిత్రమిది. తదుపరి ‘మహా సముద్రం’ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’ శర్వా చేతిలో ఉంది. కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇలా వరుసగా మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న శర్వా సైలెంటుగా వేరొక సినిమా షూటింగ్ ని పూర్తి చేసేశాడు. బ్లాక్ బస్టర్ ఖైదీ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న శర్వా 30 సెట్స్ పై ఉంది. శ్రీ కార్తీక్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలు రాశారు. కెరీర్ 30వ సినిమా(టైటిల్ నిర్ణయించాల్సి ఉంది)ని ఎంతో ఆసక్తిగా చేస్తున్నాడు. ఇందులో తెలుగమ్మాయి రీతూ వర్మ నాయిక. సీనియర్ నటి అక్కినేని అమల ఒక ముఖ్య పాత్ర పోషించారు. కొవిడ్-19 లాక్ డౌన్ తరవాత ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తయిందని శర్వా తెలిపారు. జేక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.