Begin typing your search above and press return to search.

కోలీవుడ్ పై ఫోకస్ పెట్టిన టాలీవుడ్ యువ హీరో...!

By:  Tupaki Desk   |   7 Jun 2020 5:36 PM IST
కోలీవుడ్ పై ఫోకస్ పెట్టిన టాలీవుడ్ యువ హీరో...!
X
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా విలక్షణమైన పాత్రలను విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. 'గమ్యం' 'ప్రస్థానం' 'అందరి బంధువయా' 'రన్ రాజా రన్' 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' 'ఎక్సప్రెస్ రాజా' 'శతమానం భవతి' 'మహానుభావుడు' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే కొంతకాలంగా శర్వానంద్ వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. 'ప‌డి ప‌డి లేచే మ‌న‌సు' 'ర‌ణ రంగం' 'జాను' చిత్రాలు ఆశించిన విజ‌యాన్ని సాధించ‌క‌పోవ‌డంతో తదుపరి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు శర్వా. ఈ క్రమంలో 'శ్రీకారం' అనే సినిమాకి శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రానికి కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కంప్లీట్ అవ్వగా థియేటర్స్ ఓపెన్ అయ్యాక రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

కాగా శర్వానంద్ 'శ్రీకారం' ఓ త‌మిళ నిర్మాత‌తో క‌లిసి ద్వి భాషా చిత్రం చేయ‌నున్న‌ట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ న‌డుస్తోంది. శర్వా ఇంతకముందు కొన్ని తమిళ సినిమాలు చేశాడు. ఎంజియుమ్ ఎప్పొధుమ్ (జర్నీ), జేకే ఎనుమ్ నన్‌ బనిన్‌, వాజ్‌ కాయ్ (రాజాధి రాజా) వంటి చిత్రాలలో నటించి అక్కడ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు శర్వా. గ‌త కొన్నేళ్లుగా టాలీవుడ్ పై ఫోక‌స్ పెట్టిన శ‌ర్వా కోలీవుడ్ వైపు అడుగులు వేయ‌లేదు. అయితే ఇప్పుడు అందరూ పాన్ ఇండియా మూవీస్ తో వస్తున్న నేపథ్యంలో శర్వా కూడా బహు భాషా చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలోనే ఈసారి తెలుగు త‌మిళ్‌ లో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడు. 'ఖైదీ' 'ఖాకీ' 'అరువి' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎస్ ఆర్ ప్రభు ఈ బైలింగ్యువల్‌ చిత్రాన్ని నిర్మించనున్నాడు. శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. మరి ఈ సినిమాతో శర్వా తెలుగు తమిళ భాషల్లో సక్సెస్ అవుతాడేమో చూడాలి. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.