Begin typing your search above and press return to search.
డిశ్చార్జ్ అయ్యాడు.. డబ్బింగ్ సూట్ కేనా?
By: Tupaki Desk | 22 Jun 2019 5:04 AM GMTవెర్సటైల్ స్టార్ శర్వానంద్ భుజానికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. స్కై డైవింగ్ చేస్తూ అదుపుతప్పి కిందపడిపోయిన శర్వాకి పెద్ద గాయమే అయ్యిందని డాక్టర్లు ధృవీకరించారు. భుజం ఎముకలు కదిలాయని దానికి 11 గం.ల పాటు శ్రమించి సర్జరీ కూడా చేశారు సన్ షైన్ డాక్టర్లు. కొన్ని వారాల పాటు శర్వానంద్ కి బెడ్ రెస్ట్ ని సూచించారు. తాజాగా శర్వా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ వీడియోలో అతడి చేతికి సిమెంట్ కట్టు వేసి ఉంది. అంటే గాయం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియో ప్రస్తుతం ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది.
అంతా బాగానే ఉంది కానీ.. శర్వానంద్ ఇలా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగానే అతడిపై సినిమాలకు సంబంధించిన ఒత్తిడి ఎక్కువే ఉంటుందని తాజా పరిణామం చెబుతోంది. ఇప్పటికే రణరంగం చిత్రీకరణ పూర్తయింది. శర్వా వచ్చి డబ్బింగ్ చెబుతాడని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెయిట్ చేస్తోంది. ఒకవేళ డబ్బింగ్ పూర్తయ్యి ఆగస్టులో రిలీజ్ ఉంటే ఇక శర్వానంద్ కి విశ్రాంతికి సమయం చిక్కదు. అటుపై ప్రమోషన్స్ అంటూ హడావుడి ఉంటుంది. దీంతో పాటు దిల్ రాజు ఇప్పటికే 96 రీమేక్ ని పూర్తి చేసేందుకు ఆత్రంగా ఉన్నారని తెలుస్తోంది.
హీరోకి ప్రమాదం జరిగితే ముప్పు ఎలా ఉంటుందో ఎందరో నిర్మాతలకు అనుభవమే. శర్వాకి జరిగిన ప్రమాదం వల్ల కీలకమైన షెడ్యూల్స్ బ్లాక్ అయిపోయాయి. అదృష్టవశాత్తూ అతడికి శస్త్ర చికిత్స ద్వారా గాయం నయం అయిపోతోంది కాబట్టి ఓకే. ఇక ఆగస్టులో రణరంగం రిలీజైతే అటుపై 96 రీమేక్ ని దసరా బరిలో తెచ్చేందుకు శర్వానంద్ సైతం కాస్త అటెన్షన్ తోనే ఉన్నారట. అయితే రెండు వారాలు మినిమం విశ్రాంతి లేనిదే ఎటూ వెళ్లకూడదని డాక్టర్లు సూచించారని చెబుతున్నారు.