Begin typing your search above and press return to search.

శర్వా కోసం పదేళ్ళ సర్దుబాటు

By:  Tupaki Desk   |   22 Jan 2019 7:14 AM GMT
శర్వా కోసం పదేళ్ళ సర్దుబాటు
X
ఎఫ్2 సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న దిల్ రాజు తమిళ బ్లాక్ బస్టర్ 96 తెలుగు రీమేక్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. స్క్రిప్ట్ పనులు వేగవంతం అయ్యాయి. అయితే ఒరిజినల్ వెర్షన్ లో కథ ఇరవై ఏళ్ళు వెనక్కు వెళ్తుంది. అంటే 1996లో పదో తరగతి కలిసి చదువుకున్న హీరో హీరొయిన్లు వర్తమానంలో కలుసుకోవడం ఉంటుంది. అందుకే మిడిల్ ఏజ్ పాత్రలకు విజయ్ సేతుపతి త్రిషలు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు.

అయితే ఇక్కడ చేస్తోంది శర్వానంద్ కాబట్టి మరీ అంత వెనక్కు వెళ్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారా అ లుక్ నప్పుతుందా అనే డౌట్ వచ్చింది యూనిట్ కి. అందుకే కథను ఇరవై ఏళ్ళు వెనక్కు తీసుకెళ్ళే బదులు పదేళ్ళకు మార్చి 2009లో శర్వా-సమంతాలు టెన్త్ క్లాసు చదివినట్టు చూపిస్తారన్న మాట. సో వయసు పరంగా కూడా ఇద్దరికీ సెట్ అవుతుందన్న మాట. ఇది బాగానే ఉంది కాని 96 మూవీ అంత ఫీల్ కలిగించడానికి గల కారణమే అప్పటి నేపధ్యం.

సెల్ ఫోన్ ఇంటర్నెట్ లేని అప్పటి స్వచ్చమైన వాతావరణాన్ని పునఃసృష్టి చేసిన తీరు విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తెలుగులో 2009 తీసుకుంటే సెల్ ఫోన్లు ఇంటర్ నెట్లు అన్ని చూపించాల్సి ఉంటుంది. మరికొన్ని కీలకమైన మార్పులు అవసరం అవుతాయి. ఫీల్ తగ్గే ఛాన్స్ లేకపోలేదు. అయితే దర్శకుడు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటాడు అనే దాని మీదే ఇది ఆధారపడి ఉంటుంది. అయితే అదంత సులభం కాదు కాబట్టే టైం తీసుకుని మరీ సెట్ చేస్తున్నారు. పడి పడి లేచే మనసుతో స్ట్రోక్ తిన్న శర్వానంద్ మళ్ళి మళ్ళి రాని రోజు తరహలో ఇది పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు