Begin typing your search above and press return to search.

రెండున్నర నుండి మూడున్నర చేశాడు

By:  Tupaki Desk   |   1 March 2017 8:05 AM GMT
రెండున్నర నుండి మూడున్నర చేశాడు
X
ఒక సినిమా హిట్టయితే చాలా.. ఆ రేంజు వేరేలా ఉంటుంది. సినిమాను తీసిన దర్శకుడు సంగతి ఏమో కాని.. ఆ హీరో అండ్ హీరోయిన్ కు మాత్రం వెంటనే రెమ్యూనరేషన్ తెగ పెరిగిపోతుంది. ఇప్పుడు శర్వానంద్ విషయంలో కూడా అదే జరిగిందిలే.

''శతమానం భవతి'' సినిమాతో మనోడు ఓ రేంజులో హిట్టు కొట్టేశాడు. తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అంటే చూసుకోండి. పైగా ఇలా 30 కోట్ల రేంజ్ హిట్టు కొట్టేయడం వలన ఖచ్చితంగా మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. మాంచి డిపెండబుల్ హీరో అయిపోయాడు. అందుకే ఇప్పుడు శర్వానంద్ కు ఎక్కువగా సమర్పించుకోవడానికి కూడా నిర్మాతలు పెద్దగా ఫీలవ్వట్లేదు. మొన్నటివరకు 2 కోట్ల నుండి 2.5 కోట్ల వరకు వసూలు చేసిన శర్వా.. ఇప్పుడు శతమానం హిట్టయ్యాక ఏకంగా 3.5 నుండి 4 కోట్ చేస్తున్నాడట. మూడున్నర మినిమం ఇస్తేనే సంతకం పెడుతున్నాడట.

ఇప్పటికే ఈ కొత్త రేట్లు ఇచ్చుకుని గీతా ఆర్ట్స్.. సితార ఎంటర్టయిన్మెంట్స్ చినబాబు.. అలాగే బాహబులి నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు మనోడితో సినిమాను చేయడానికి ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ''రాధ'' సినిమాతో వస్తున్నాడు శర్వానంద్. ఈరోజు సాయంత్రం ఈ సినిమా టీజర్ రిలీజవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/