Begin typing your search above and press return to search.
శర్వానంద్ తగ్గి ఉండటానికి కారణం అదేనా?
By: Tupaki Desk | 9 Sep 2022 12:30 AM GMT'ఒకే ఒక జీవితం' సినిమాతో ఈ నెల 9వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి శర్వానంద్ రెడీ అవుతున్నాడు. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, హీరోకి తల్లి పాత్రలో అమల నటించారు. ఇతర ముఖ్యమైన పాత్రలను నాజర్ .. వెన్నెల కిశోర్ .. ప్రియదర్శి పోషించారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేసిన దగ్గర నుంచి మదర్ సింటిమెంట్ కి సంబంధించిన సినిమా అనుకున్నారు. 'అమ్మ' పాటను వదిలిన దగ్గర నుంచి అది మరింత బలపడిపోయింది. ఆ తరువాత మదర్ సింటిమెంట్ నేపథ్యంలోనే టైమ్ ట్రావెల్ ట్రాక్ నడుస్తుందని రివీల్ చేశారు.
ట్రైలర్ రిలీజ్ .. మరికొంత ప్రమోషన్ నడిచిన తరువాత, తన చిన్నప్పుడు తల్లి నుంచి పొందవలసిన కొన్ని అనుభూతులను పొందడానికిగాను, హీరో తన స్నేహితులతో కలిసి కాలంలో వెనక్కి వెళతాడనే విషయం స్పష్టంగా అర్థం కావడంతో .. ఇదేదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందే అని జనాలు ఇటో లుక్ వేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో శర్వానంద్ మాత్రమే ఎక్కువగా పాల్గొన్నాడు. ప్రతి ఇంటర్వ్యూలోను ఇదో మంచి సినిమా అని మాత్రమే చెబుతూ వచ్చాడు. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాడు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సింపుల్ గానే జరిగింది. ముఖ్య అతిథులు .. పొగడ్తలు .. ప్రశంసలు గట్రా ఏమీ లేకుండా నడిచిపోయింది. శర్వానంద్ పెద్దగా ఏమీ మాట్లాడలేదే .. సినిమాను గురించి ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదే అని కొంతమంది అనుకున్నారు.
కావాలనే శర్వానంద్ అలా ఈ సినిమా విషయంలో సింపుల్ గా మాట్లాడాడనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోలు ప్రీ రిలీజ్ వేడుకలలో రెచ్చిపోతున్నారు. 'ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం .. రాసిపెట్టుకోండి' అనేస్తున్నారు. ఇంతవరకూ ఇలాంటి ఒక పాయింట్ ను ఎవరూ టచ్ చేయలేదని చెప్పేస్తున్నారు.
ఇక ఇలాంటి ఫంక్షన్లకి చుట్టపు చూపుగా వచ్చినవాళ్లు కూడా ఎంతమాత్రం తగ్గడం లేదు. ఇలాంటి హీరో ఒక్కరుంటే చాలు అతన్ని పట్టుకుని ఇండస్ట్రీ మొత్తం ఈదేస్తుంది అంటూ .. ఎంతమొత్తం కలెక్ట్ చేయవచ్చునో కూడా అక్కడే చెప్పేస్తున్నారు.
తీరా థియేటర్ కి వెళ్లిన తరువాత ఆ సినిమా అక్కడ మూడు రోజులకు మించి ఉండలేకపోతోంది. ఈ మాత్రం దానికేనా ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పారు అనుకున్న ప్రేక్షకుల నుంచి ట్రోలింగ్ మొదలవుతోంది. అందువల్లనే అలాంటివేం లేకుండా, మౌత్ టాక్ తోనే ఈ సినిమా జనంలోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే శర్వానంద్ కాస్త తగ్గి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పాలాసినీని ఫాలో అయిపోవడమే బెటరేమో!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.