Begin typing your search above and press return to search.
ఔను ఆమె ఉపాసన బంధువే!
By: Tupaki Desk | 2 Sep 2020 11:30 PM GMTయంగ్ హీరో శర్వానంద్ ప్రేమలో ఉన్నాడని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అమ్మాయి ఎవరు అనే విషయంలో రకరకాల ప్రచారం అయితే జరుగుతోంది. ఇటీవలే మాకు అందిన సమాచారం ప్రకారం ఆమె కామినేని ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని ఉపాసనకు కజిన్ అవుతుందని కూడా చెప్పాం. ఇప్పుడు ఆ విషయమై మరింత ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్.. శర్వాలు మంచి స్నేహితులు అనే విషయం తెల్సిందే. చరణ్ కు కామినేని ఫ్యామిలీతో ఉన్న పరిచయంతోనే శర్వాకు ఆ అమ్మాయి పరిచయం అయ్యి ఉంటుందని అంటున్నారు.
శర్వానంద్ ప్రేమ విషయంలో ఉపాసన కూడా సాయంగా నిలిచారట. కుటుంబ సభ్యులను ఈ పెళ్లికి ఒప్పించడంలో ఉపాసన కీలకంగా వ్యవహరించారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. శర్వానంద్ ప్రేయసి ఎవరు అనే విషయంలో క్లారిటీ రాలేదు. కాని ఆమె కామినేని కుటుంబంకు చెందిన అమ్మాయి అని ఉపాసనకు కజిన్ అవుతుందనే విషయాలు మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇంతకు ముందు కొద్ది మంది మాత్రమే ఈ విషయంలో మాట్లాడుకునే వారు. కాని లాక్ డౌన్ ఎఫెక్ట్ మరియు ఇతరత్ర కారణాల వల్ల ప్రస్తుతం టాలీవుడ్ లో శర్వానంద్ పెళ్లి గురించిన ప్రచారం జోరుగా సాగుతోంది. పూర్తి వివరాలను త్వరలోనే శర్వానంద్ వెళ్లడిస్తాడని ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు.